తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tecno Pova 4 Pro। టెక్నో కొత్త ఫోన్ చూశారా.. ఫీచర్లు చాలానే ఉన్నాయి!

Tecno Pova 4 Pro। టెక్నో కొత్త ఫోన్ చూశారా.. ఫీచర్లు చాలానే ఉన్నాయి!

HT Telugu Desk HT Telugu

10 October 2022, 13:37 IST

    • టెక్నో కంపెనీ నుంచి సరికొత్త Tecno Pova 4 Pro స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి.
Tecno Pova 4 Pro
Tecno Pova 4 Pro

Tecno Pova 4 Pro

ట్రాన్షన్ టెక్నో కంపెనీ తమ పోవా సిరీస్‌ను అప్‌డేట్ చేసింది. తాజాగా Tecno Pova 4 Pro పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సాధారణంగా టెక్నో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ, స్టోరేజ్ పరిమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్తగా విడుదలైన ఈ Tecno Pova 4 Pro ఫోన్‌ కూడా ఈ రెండు అంశాల్లో బలంగా ఉంది. మిగతా ఫీచర్లు కూడా మెరుగ్గానే ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా Tecno Pova 4 Pro స్మార్ట్‌ఫోన్‌ 8GBRAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఏకైక కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. వర్చువల్ రూపంలో ర్యామ్ సామర్థ్యాన్ని మరో 5GB వరకు పెంచుకోవచ్చు. ఈ హ్యాండ్‌ సెట్ గేమింగ్ కోసం పాంథర్ ఇంజిన్ 2.0, గేమ్ స్పేస్ 2.0 వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే మల్టీలేయర్ గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్, DTS సౌండ్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

ఫీచర్లు, స్పెసిఫికేషన్ల జాబితాలో ఇంకా ఏమేమి ఉన్నాయి, ధర ఎంత మొదలైన విషయాల కోసం ఈ కింద పరిశీలించండి.

Tecno Pova 4 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.66 అంగుళాల AMOLED FHD+ డిస్‌ప్లే
  • 8GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ Helio G99 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ AI కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 45W ఛార్జర్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్

అదనంగా, డ్యూయల్ సిమ్ స్లాట్, 4G, డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్, GNSS, NFC, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, z-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మొదలైనవి ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లూ, గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

ప్రస్తుతం Tecno Pova 4 Pro బంగ్లాదేశ్ మార్కెట్లో విడుదలైంది. అక్కడ దీని ధర BDT 26,990 అంటే సుమారు రూ. 21,500/- . ఈ దీపావళి నాటికి భారత్ సహా ఇతర మార్కెట్లోనూ ఈ ఫోన్ లభించే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ధర మరింత తక్కువగా ఉండే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం