Tecno Pova 4 Series Launch | కొత్త తరం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న టెక్నో!-tecno to launch its next gen tecno pova 4 smartphone series check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tecno Pova 4 Series Launch | కొత్త తరం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న టెక్నో!

Tecno Pova 4 Series Launch | కొత్త తరం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న టెక్నో!

HT Telugu Desk HT Telugu
Oct 03, 2022 11:12 AM IST

టెక్నో మొబైల్ కంపెనీ తమ తదుపరి తరం Pova స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో త్వరలో విడుదల చేయనుంది. Tecno Pova 4 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు విడుదలకు ముందే లీక్ అయ్యాయి. ఆ వివరాలు చూడండి.

Tecno Pova 4
Tecno Pova 4

చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ట్రాన్షన్ టెక్నో ఈ ఏడాది జూన్ నెలలో Tecno Pova 3 అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 7,000mAh సామర్థ్యం కలిగిన మెగాపవర్ బ్యాటరీతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు దీనికి అప్‌డేట్ వెర్షన్‌గా Tecno Pova 4 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతుంది.

టెక్నో కంపెనీ ఇప్పటికే Pova సిరీస్‌లో వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇప్పుడు Pova 4 సిరీస్‌తో లైనప్‌ను రిఫ్రెష్ చేయడానికి సిద్ధమవుతోంది. టెక్నో ఈ లాంచ్ గురించి ఎటువంటి వివరాలను అధికారికంగా ధృవీకరించలేదు కానీ, కొత్త సిరీస్‌కు సంబంధించి కొన్ని కీలక స్పెసిఫికేషన్లు, ఇతర సమాచారాన్ని వెల్లడించింది. త్వరలోనే Tecno Pova 4 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని పలు నివేదికలు పేర్కొన్నాయి. విడుదలకు ముందే సరికొత్త Tecno Pova 4 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన డిజైన్, కొన్ని ఫీచర్లను లీక్ చేశాయి. వాటి ఆధారంగా కొత్త సిరీస్ ఫోన్ ఎలా ఉండబోతుందో ఇక్కడ అందజేస్తున్నాం.

Tecno Pova 4 స్మార్ట్‌ఫోన్‌ బ్లూ, గ్రే , బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. రెండోది డ్యూయల్-టోన్ లుక్ కోసం ఆరెంజ్ యాక్సెంట్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ డిజైన్ ఇటీవల లాంచ్ అయిన Tecno Pova Neo 2 మాదిరిగానే ఉండనుంది.

స్పెసిఫికేషన్ల పరంగా ఈ నూతన తరం ఫోన్ 8GB RAM, 256GB అంతర్గత నిల్వతో ఏకైక కాన్ఫిగరేషన్లో ఉంటుంది. ర్యామ్ సామర్థ్యాన్ని అదనంగా 8GB వరకు విస్తరించుకోవచ్చు. మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల జాబితాను ఈ కింద చూడండి.

Tecno Pova 4 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ లీక్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.82 అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే
  • 8GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ Helio G99 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ 2MPమెగా పిక్సెల్ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్

ఫీచర్లను బట్టి చూస్తే ఈ ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్ ఫోన్‌గా ఉండనుంది. ఈ దీపావళికి Tecno Pova 4 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది. అయితే ఆ లోపే దీని లాంచ్ ఉండబోతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం