Moto E32 Smartphone | ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర తక్కువ.. ఫీచర్లు, ఆఫర్లు ఎక్కువ!-motorola launches entry level moto e32 smartphone check price discount offers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Moto E32 Smartphone | ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర తక్కువ.. ఫీచర్లు, ఆఫర్లు ఎక్కువ!

Moto E32 Smartphone | ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర తక్కువ.. ఫీచర్లు, ఆఫర్లు ఎక్కువ!

HT Telugu Desk HT Telugu
Oct 09, 2022 11:56 AM IST

మోటోరోలా కంపెనీ Moto E32 అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కొత్తగా లాంచ్ చేసింది. దీనిపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి.

Moto E32
Moto E32

మొబైల్ తయారీదారు మోటోరోలా తాజాగా Moto E32 అనే ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఒక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్, ధర తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇందులో ఫీచర్లు మెరుగ్గా ఉన్నాయి. ఇందులో భాగంగా రిఫ్రెష్ రేట్‌తో HD+ రెసల్యూషన్ కలిగిన డిస్‌ప్లే, Quad Pixel టెక్నాలజీతో డ్యుఎల్ కెమెరా సెటప్, ఎక్కువ కాలం లైఫ్ అందించే బ్యాటరీ మొదలైనవి ఉన్నాయి.

Motorola కంపెనీ కొన్ని నెలల క్రితమే యూరోపియన్ మార్కెట్లో Moto E32ని విడుదల చేసింది, అయితే ఆ వేరియంట్ భారతీయ మోడల్‌తో పోలిస్తే స్పెసిఫికేషన్‌ల పరంగా భిన్నంగా ఉంది. ఇంతకు ముందు భారత మార్కెట్లో Moto E32s పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తాజాగా విడుదలైన మోడల్ కూడా డిజైన్, కొన్ని ఫీచర్ల పరంగా పాత వెర్షన్‌తో పోలికలు ఉన్నాయి.

సరికొత్త Moto E32 స్మార్ట్‌ఫోన్ IP52 రేటింగ్ కలిగిన వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌తో వచ్చింది. ఇది ఐస్‌బర్గ్ బ్లూ, కాస్మిక్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. స్టోరేజ్ పరంగా ఏకైక కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. ఫీచర్లలో జాబితాలో ఇంకా ఏమేం ఉన్నాయి, ధర ఎంత మొదలైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

Moto E32 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే
  • 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ 2MP డ్యుఎల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్

అదనంగా.. 4G సపోర్ట్, బ్లూటూత్ v5.0, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB టైప్-సి పోర్ట్, డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్, 1TB వరకు సపోర్ట్ చేసే మైక్రో SD కార్డ్ స్లాట్, ఫేస్ అన్‌లాక్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ మొదలైన సదుపాయాలు ఉన్నాయి.

Moto E32 ధర రూ. 10,499/- , Flipkartలో అందుబాటులో ఉంటుంది. HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,000 వరకు తగ్గింపును పొందవచ్చు. రిలయన్స్ జియోతో పాటు కొనుగోలు చేస్తే రూ. 2,549 వరకు ప్రయోజనాలు ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం