తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sbi Fd Interest Rates : ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్​బీఐ.. మీరు చెక్​ చేశారా?

SBI FD interest rates : ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్​బీఐ.. మీరు చెక్​ చేశారా?

Sharath Chitturi HT Telugu

29 December 2023, 12:05 IST

  • SBI FD interest rates : ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను పెంచిందిన ఎస్​బీఐ. దీనితో సాధారణ పౌరులు, సీనియర్​ సిటీజెన్​లకు ప్రయోజనం చేకూరనుంది!

ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్​బీఐ.. మీరు చెక్​ చేశారా?
ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్​బీఐ.. మీరు చెక్​ చేశారా? (REUTERS)

ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్​బీఐ.. మీరు చెక్​ చేశారా?

SBI FD interest rates : ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది ఎస్​బీఐ. డిసెంబర్​ 27 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏ టెన్యూర్​పై ఎంత మేర వడ్డీ రేట్లు పెరిగాయి? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

ఎస్​బీఐ వడ్డీ రేట్లు ఇలా..

7 రోజుల నుంచి 45 రోజుల్లో మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను 50 బేసిస్​ పాయింట్లు పెంచింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. ఫలితంగా.. వీటిపై ఇప్పుడు 3.5శాతం వడ్డీ లభిస్తోంది. ఇక 46 రోజులు నుంచి 179 రోజుల మధ్యలో మెచ్యూర్​ అయ్యే ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని 25 బేసిస్​ పాయింట్లు పెచ్చింది. తాజా పెంపుతో వీటిపై 4.75శాతం వడ్డీ లభిస్తున్నట్టు అయ్యింది.

ఇక 180 రోజుల నుంచి 210 రోజుల మధ్యలో మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీలపై 50 బేసిస్​ పాయింట్ల పెంపుతో 5.75శాతం వడ్డీ ఇస్తోంది ఎస్​బీఐ. 211 రోజుల నుంచి 1 ఏడాదిలోపు మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీలపై 6శాతం, 3ఏళ్ల నుంచి 5ఏళ్లలోపు మెచ్యూర్​ అయ్యే ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 6.75శాతం వడ్డీ లభిస్తోంది.

SBI hikes fixed deposit rates : 1 ఏడాది నుంచి 2ఏళ్ల కాల వ్యవధి ఉండే ఎఫ్​డీలపై, 2ఏళ్లు- 3ఏళ్ల మధ్యలో మెచ్యూర్​ అయ్యే వాటిపై వడ్డీ రేట్లను స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా పెంచలేదు.

7 - 45 రోజులు:- 3.50%

46 - 179 రోజులు:- 4.75%

180 - 210 రోజులు:- 5.75%

211 రోజులు - 1 year లోపు:- 6%

1 ఏడాది - 2 ఏళ్ల లోపు:- 6.80%

2 ఏళ్లు- 3ఏళ్ల లోపు:- 7.00%

3 ఏళ్లు- 5 ఏళ్లలోపు:- 6.75%

5 ఏళ్లు- 10 ఏళ్లలోపు:- 6.50%

సీనియర్​ సిటీజెన్​లకు ఇలా..

SBI FD rates for senior citizens : ఎస్​బీఐ ఎఫ్​డీలతో సీనియర్​ సిటీజెన్​లకు సాధారణ పౌరులతో పోల్చుకుంటే కాస్త బెనిఫిట్స్​ ఎక్కువగానే ఉన్నాయి. మెచ్యురీటీ ఆధారంగా.. ఆయా ఎఫ్​డీలపై 50 బేసిస్​ పాయింట్లు పెంచింది ఎస్​బీఐ.

7 - 45 రోజులు:- 4%

46 - 179 రోజులు:- 5.25%

180 - 210 రోజులు:- 6.25%

211 రోజులు - 1 year లోపు:- 6.5%

1 ఏడాది - 2 ఏళ్ల లోపు:- 7.30%

2 ఏళ్లు- 3ఏళ్ల లోపు:- 7.50%

3 ఏళ్లు- 5 ఏళ్లలోపు:- 7.25%

5 ఏళ్లు- 10 ఏళ్లలోపు:- 7.5%

SBI FD rate hike : చివరిగా.. 2023 ఫిబ్రవరిలో ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను సవరించింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకుంది. రెపో రేట్ల పెంపును ఆర్​బీఐ నిలిపివేసినప్పటికీ.. ఎస్​బీఐ.. తన ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచడం విశేషం.

యాక్సిస్​ బ్యాంక్​ కూడా ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను పెంచింది. రూ. 2కోట్లలోపు ఉండే ఎఫ్​డీల విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది.

తదుపరి వ్యాసం