SBI Clerk Recruitment : ఎస్బీఐలో 8వేలకు పైగా ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రక్రియ షురూ!
SBI Clerk Recruitment : ఎస్బీఐలో 8283 పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది. ఎలా అప్లై చేసుకోవాలి? విద్యార్హతలేంటి? వయస్సు పరిమితి ఎంత? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
SBI Clerk Recruitment 2023 : క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం ఇటీవలే నోటిఫికేషన్ని విడుదల చేసిన ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా).. శుక్రవారం నాడు అప్లికేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది. జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్ట్‌పై ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు.. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియకు తుది గడువు 2023 డిసెంబర్ 7. డిసెంబర్ 22లోపు అప్లికేషన్లను ప్రింట్ చేసుకోవచ్చు.
ఈ దఫా రిక్రూట్మెంట్లో మొత్తం 8283 ఖాళీలను భర్తీ చేయనుంది బ్యాంకింగ్ దిగ్గజం. ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2023 డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇలా అప్లై చేసుకోండి..
ఈ కింద చెప్పిన స్టెప్స్ పాటించి.. ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2023కు అప్లై చేసుకోండి.
SBI Clerk Recruitment application : స్టెప్ 1:- ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి. లేదా పైన ఇచ్చిన డైరక్ట్ లింక్‌ని క్లిక్ చేయండి.
స్టెప్ 2:- హోం పేజ్ మీద కనిపించే ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2023 లింక్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:- రిజిస్ట్రేషన్ డీటైల్స్ ఎంటర్ చేసి, సబ్మీట్ బటన్ క్లిక్ చేయండి.
స్టెప్ 4:- అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
స్టెప్ 5:- సబ్మీట్ బట్ క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దానిని డౌన్లోడ్ చేసుకోండి.
SBI Clerk Recruitment apply online : ఎస్బీఐ నోటిఫికేషన్ ప్రక్రియ ప్రకారం.. క్లర్క్ రిక్రూట్మెంట్ 2023 ప్రిలిమ్స్ పరీక్ష.. జనవరి 2024లో జరుగుతుంది. మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 2024లో నిర్వహిస్తారు. కరెక్ట్ డేట్స్‌ను ఎస్బీఐ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వస్తుంది.
విద్యార్హత..
ఈ పోస్ట్‌లకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి, ఏదైనా విభాగంలో కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత అయినా కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు కూడా అర్హులే. వారు డిసెంబర్ 31, 2023 నాటికి ఐడీడీ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
అభ్యర్థుల వయస్సు.. 20 నుంచి 28ఏళ్ల మధ్యలో ఉండాలి.
SBI Clerk Recruitment notification : అప్లికేషన్ ఫీజు:- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఉచితం. జనరల్, ఓబీసీ, ఈబీసీ అభ్యర్థులకు రూ. 750.
సంబంధిత కథనం