తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo Find N2 And Find N2 Flip Debut: ఒప్పొ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్

Oppo Find N2 and Find N2 Flip debut: ఒప్పొ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్

HT Telugu Desk HT Telugu

17 December 2022, 16:51 IST

    • ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పొ(Oppo) మరో రెండు కొత్త ఫోన్ లను మార్కెట్ లో ప్రవేశపెడుతోంది. ఇవి రెండూ కూడా ఫోల్డబుల్ ఫోన్స్ కావడం విశేషం.
ఒప్పొ ఫైండ్ ఎన్ 2 ఫోల్డబుల్ ఫోన్
ఒప్పొ ఫైండ్ ఎన్ 2 ఫోల్డబుల్ ఫోన్

ఒప్పొ ఫైండ్ ఎన్ 2 ఫోల్డబుల్ ఫోన్

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పొ(Oppo) తన ఫోల్డబుల్(foldable phone) ఫోన్స్ రేంజ్ ను మరింత విస్తృతం చేసింది. కొత్తగా ఒప్పొ ఫైండ్ ఎన్ 2, ఒప్పొ ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్ లను లాంచ్ చేసింది. వీటిలో స్నాప్ డ్రాగన్, మీడియా టెక్ చిప్ సెట్ లను అమర్చింది. ప్రస్తుతం ఫోల్డబుల్(foldable phone) ఫోన్ల మార్కెట్లో స్యామ్సంగ్(Samsung) మార్కెట్ లీడర్ గా ఉంది. అయితే, స్యామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ల ధర చాలా ఎక్కువ. అందువల్ల తక్కువ ధరలో అన్ని ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్లను అందించాలని ఒప్పొ(Oppo) భావిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

ఒప్పొ ఫైండ్ ఎన్ 2(Oppo Find N2)

ఫోల్డబుల్ డిజైన్ తో వస్తున్న ఫోన్ ఇది. ఫైండ్ ఎన్ సిరీస్ ను ఒప్పొ(Oppo) 2021లో ప్రారంభించింది. ఒప్పొ ఫైండ్ ఎన్ 2(Oppo Find N2)లో 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో 5.54 అంగుళాల డిస్ ప్లే ఉంది.ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెనరేషన్ 1 ప్రాసెసర్ (Qualcomm Snapdragon 8+ Gen 1 processor) ను అమర్చారు. అలాగే, ఇందులో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS)తో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 48 ఎంపీ అల్ట్రా వైడ్, 32 ఎంపీ టెలీఫొటో లెన్స్ లను కూడా అమర్చారు. ఇందులో తొలిసారి మారి సిలికాన్ ఎక్స్ చిప్ సెట్(MariSilicon X chipset) సహకారంతో రూపొందించిన హాసిల్ బ్లాడ్ కలర్ ట్యూనింగ్ సదుపాయం కల్పించారు. అలాగే, 67వాట్ చార్జింగ్ స్పీడ్ తో 4520 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో పొందుపర్చారు.

ఒప్పొ ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్(Oppo Find N2 Flip)

ఒప్పొ(Oppo) నుంచి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ స్యామ్సంగ్ గేలక్సీ జెడ్ ఫ్లిప్ సిరీస్(Samsung Galaxy Z Flip series) ఫోన్లతో పోటీ పడుతోంది. ఈ ఫోన్ కు 60Hz రిఫ్రెష్ రేట్ తో 3.6 అంగుళాల ఓఎల్ఈడీ ఔటర్ డిస్ ప్లే(OLED outer display) ఉంటుంది. లోపలి వైపు, 120Hz రిఫ్రెష్ రేట్ తో, HDR10+ సపోర్ట్ తో 6.8 అంగుళాల AMOLED LTPO panel inner display ను అమర్చారు. ఈ ఫోన్ మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ఎస్ఓసీతో ఉంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లో 16 జీబీ ర్యామ్(RAM), 512 జీబీ స్టోరేజ్(storage) ఉంది. 191 గ్రాముల బరువు ఉండే ఈ ఫోన్ ధర భారత్ లో సమారు 70 వేలుగా ఉండొచ్చు.

తదుపరి వ్యాసం