Ola care subscription plans : ఓలా కేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ లాంచ్.. లాభాలెన్నో!
29 January 2023, 13:53 IST
- Ola care subscription plans : కేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను లాంచ్ చేసింది ఓలా. వాటి ఫీచర్స్, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఓలా కస్టమర్ల కోసం ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్స్!
Ola care subscription plans : కస్టమర్ల కోసం రెండు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌ను ప్రకటించింది ఓలా ఎలక్ట్రిక్. అవి ఓలా కేర్, ఓలా కేర్+. వీటి ధరలు వరుసగా రూ. 1,999- రూ. 2,999గా ఉన్నాయి. అంతేకాకుండా.. మరికొన్ని రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో 200కుపైగా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఓపెన్ చేసేందుకు ప్రణాళికలు రచించింది. రానున్న రోజుల్లో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఓలా కేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్..
ఈ ఓలా కేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నట్టు సంస్థ చెబుతోంది. సర్వీసింగ్ సమయంలో ఫ్రీ లేబర్ కాస్ట్, థెఫ్ట్ అసిస్టెన్స్ హెల్ప్‌లైన్, రోడ్‌సైడ్- పంచర్ అసిస్టెన్స్ వంటి వెసులుబాట్లు ఇస్తోంది.
Ola care subscription plan prices : ఇక ఓలా కేర్+లో.. ఓలా కేర్‌తో పాటు యాన్యువల్ కాంప్రిహెన్సివ్ డైగ్నాస్టిక్, ఫ్రీ హోం సర్వీస్, పికప్/ డ్రాప్, ఫ్రీ కన్జ్యూమబుల్స్, 24/7 డాక్టర్ అండ్ అంబులెన్స్ సర్వీసులు అదనంగా లభిస్తుండటం విశేషం.
ప్రస్తుతం.. దేశంలోని 600కుపైగా నగరాల్లో సర్వీస్ వ్యాన్స్, ఫిజికల్ స్టోర్స్‌ను నడుపుతోంది ఓలా. వీటి ద్వారా.. కస్టమర్లకు సర్వీసులను వేగంగా అందిస్తోంది. కొన్ని కొన్నిసార్లు.. ఒక రోజులోపే కస్టమర్ల సమస్యలు, సర్వీసు కార్యకలాపాలు పూర్తవుతున్నట్టు ఓలా చెబుతోంది.
Ola care subscription plan in India : "మాది కస్టమర్ సెంట్రింగ్ బ్రాండ్. అందుకే.. సర్వీసు అనేది మా టాప్ ప్రయారిటీ. ఈ క్రమంలోనే ఓలా కేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చాము. ది బెస్ట్ సర్వీసులు అందించేందుకు కృషిచేస్తున్నాము." అని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు.
ఓలా ఎలక్ట్రిక్‌కు సంబంధించిన రెండు స్కూటర్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. అవి ఓలా ఎస్1, ఎస్1 ప్రో. ఎస్1 ఎయిర్‌ను లాంచ్ చేసింది. 2023 ఏప్రిల్‌లో వీటి డెలివరీలు మొదలవ్వొచ్చు. వీటితో పాటు ఆరు కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై ఓలా పనిచేస్తోంది.