తెలుగు న్యూస్  /  బిజినెస్  /  నిశబ్దంగా విడుదలైన Nokia G11 Plus స్మార్ట్‌ఫోన్, ధర ఎంతంటే?

నిశబ్దంగా విడుదలైన Nokia G11 Plus స్మార్ట్‌ఫోన్, ధర ఎంతంటే?

HT Telugu Desk HT Telugu

06 October 2022, 21:57 IST

    • నోకియా బ్రాండ్ మీద సరికొత్త Nokia G11 Plus స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదలైంది. ఇది బడ్జెట్ ఫోన్, దీని ధర ఫీచర్లు చూడండి.
Nokia G11 Plus
Nokia G11 Plus

Nokia G11 Plus

HMD గ్లోబల్ భారత మార్కెట్లో ఈరోజు నిశబ్దంగా Nokia G11 Plus పేరుతో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కొన్ని నెలల కిందటే ఈ G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే అందుకు సంబంధించిన వివరాలేమి అప్పుడు వెల్లడించలేదు. అయితే ఇప్పుడు మాత్ర సరికొత్త Nokia G11 Plus స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది.

సరికొత్త Nokia G11 Plus స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇది మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. రూ. 15 వేల లోపు బడ్జెట్ ధరలోనే నోకియా అధికారిక స్టోర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు, త్వరలోనే ఇతర రిటైల్ స్టోర్‌లలోనూ అందుబాటులో ఉంటుంది.

Nokia G11 Plus ఏకైక స్టోరేజ్ కాన్ఫిగరేషన్ (4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్)లో అందుబాటులో ఉంటుంది. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజ్ సామర్థ్యాన్ని 512GB వరకు పెంచుకోవచ్చు.

ఫీచర్ల జాబితాలో ఇంకా ఏమేమి ఉన్నాయి? అసలు ధర ఎంత మొదలగు వివరాలను ఇప్పుడు చూద్దాం.

Nokia G11 Plus స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.52 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
  • 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Unisoc T606 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP +2MP కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5050 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్

కనెక్టివిటీ పరంగా నోకియా G11 ప్లస్‌లో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్ v5.0, USB-C తో పాటు బ్యాక్ ప్యానెల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లు ఉన్నాయి.

ధర, రూ. 12,499/-

ఈ ఫోన్ చార్‌కోల్ గ్రే, లేక్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

తదుపరి వ్యాసం