తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Seltos: ఆయిల్ పంప్ లో లోపం వల్ల సెల్టోస్ కార్లను వెనక్కు తీసుకుంటున్న కియా

Kia Seltos: ఆయిల్ పంప్ లో లోపం వల్ల సెల్టోస్ కార్లను వెనక్కు తీసుకుంటున్న కియా

HT Telugu Desk HT Telugu

23 February 2024, 16:55 IST

    • Kia Seltos CVT: కియా నుంచి వచ్చిన ప్రీమియం ఎస్ యూ వీ ల్లో సెల్టోస్ గొప్ప సక్సెస్ సాధించింది. తాజాగా, కియా సెల్టోస్ సీవీటీ వర్షన్ కార్లలోని ఆయిల్ పంప్ లో లోపం ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. దాంతో, ఆ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
కియా సెల్టోస్ సీవీటీ వర్షన్ కారు
కియా సెల్టోస్ సీవీటీ వర్షన్ కారు

కియా సెల్టోస్ సీవీటీ వర్షన్ కారు

Kia Seltos CVT: కియా ఇండియా భారత దేశంలో విక్రయించిన 4,358 సెల్టోస్ ఎస్ యూవీ కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసింది. సెల్టోస్ సీవీటీ వెర్షన్ కార్లను మాత్రమే వెనక్కు తీసుకుంటున్నట్లు కియా వెల్లడించింది. సెల్టోస్ సీవీటీ వర్షన్ కార్లలో ‘‘ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్’’ లో లోపాన్ని గుర్తించినందువల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కియా ప్రకటించింది.

సీవీటీ గేర్ బాక్స్ లో లోపం

కియా సెల్టోస్ సీవీటీ (Kia Seltos CVT) గేర్ బాక్స్ లోని ఎలక్ట్రానిక్ ఆయిల్ బంప్ పనితీరులో లోపం కనిపించిందిని కియా ఇండియా తెలిపింది. ఈ స్వచ్ఛంద రీకాల్ కార్యక్రమం గురించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టిహెచ్) కు తెలియజేశామని కియా తెలిపింది. ఆయిల్ పంప్ లోపంతో డెలివరీ అయిన సెల్టోస్ కార్లు ఫిబ్రవరి 28, 2023 నుంచి జులై 13, 2023 మధ్య ఉత్పత్తి అయ్యాయి. ఈ పీరియడ్ లో 4,358 సెల్టోస్ సీవీటీ కార్లను కియా ఉత్పత్తి చేసింది. ఈ కార్లను కొనుగోలు చేసిన వినియోగదారుల వివరాలను సేకరిస్తున్నామని, వారిని సంప్రదించి, వారి కారును రీకాల్ చేసి, లోపభూయిష్టమైన కాంపోనెంట్ ను భర్తీ చేస్తామని కియా తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియను దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా చేస్తామని తెలిపింది.

కియా సెల్టోస్ వివరాలు..

కియా సెల్టోస్ సీవీటీ (Kia Seltos CVT) 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో లభిస్తుంది. ఈ ఎస్ యూ వీ పై 'ఐవిటి' బ్యాడ్జ్ ఉంటుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ సుమారుగా 113 బిహెచ్ పి పవర్, 144 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సెల్టోస్ సీవీటీ హెచ్ టీ ఎక్స్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ .16.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఈ కార్లకు మాత్రమే..

ప్రస్తుతం కియా సెల్టోస్ సీవీటీ (Kia Seltos CVT) వర్షన్ కార్లను, అది కూడా ఫిబ్రవరి 28, 2023 నుంచి జులై 13, 2023 మధ్య ఉత్పత్తి అయిన వాటిని మాత్రమే రీకాల్ చేస్తుంది. మిగతా కియా వాహనాలకు ఈ రీకాల్ కు సంబంధం లేదు. కియా సెల్టోస్ సీవీటీ కస్టమర్లు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయడానికి డీలర్ షిప్ లను సంప్రదించవచ్చు. లేదా మరిన్ని వివరాల కోసం కియా కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1800-108-5000 కు కాల్ చేయవచ్చు. కియా ఇంతకుముందు నవంబర్ 2020 లో సెల్టోస్ ఎస్యూవీ డీజిల్ వేరియింట్ కోసం సర్వీస్ క్యాంపెయిన్ ను నిర్వహించింది.

టాపిక్

తదుపరి వ్యాసం