తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia 2024 Sonet Bookings: కియా సోనెట్ 2024 ఫేస్ లిఫ్ట్ మోడల్ బుకింగ్స్ ఈ 26 నుంచి ప్రారంభం

Kia 2024 Sonet bookings: కియా సోనెట్ 2024 ఫేస్ లిఫ్ట్ మోడల్ బుకింగ్స్ ఈ 26 నుంచి ప్రారంభం

HT Telugu Desk HT Telugu

21 December 2023, 15:56 IST

  • Kia 2024 Sonet bookings: కియా సోనెట్ 2024 ఫేస్ లిఫ్ట్ మోడల్ బుకింగ్స్ డిసెంబర్ 20వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. రూ. 25 వేలు చెల్లించి ఈ పాపులర్ ఎస్ యూ వీ మోడల్ ను బుక్ చేసుకోవచ్చు.

డిసెంబర్ 14న కియా సోనెట్ 2024 ఫేస్ లిఫ్ట్ మోడల్ ఆవిష్కరణ
డిసెంబర్ 14న కియా సోనెట్ 2024 ఫేస్ లిఫ్ట్ మోడల్ ఆవిష్కరణ

డిసెంబర్ 14న కియా సోనెట్ 2024 ఫేస్ లిఫ్ట్ మోడల్ ఆవిష్కరణ

Kia 2024 Sonet bookings: కియా మోటార్స్ 2024 సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ మోడల్ ను కంపెనీ డిసెంబర్ 14న ఆవిష్కరించింది. అయితే, ఈ ఫేస్ లిఫ్ట్ సోనెట్ మోడల్ ధరలను కియా ఇంకా ప్రకటించలేదు. డెలివరీ ప్రారంభమయ్యే ముందు, 2024 జనవరిలో కియా ధరలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో కూడా..

2024 కియా సోనెట్ (Kia 2024 Sonet) ను ఆన్ లైన్ లో కూడా రూ. 25 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 2024 ఫేస్ లిప్ట్ మోడల్ సోనెట్ లో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా ఏడీఏఎస్ (advanced driver assistance system ADAS) ను యాడ్ చేశారు. సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో ఏడీఏఎస్ ను ఇవ్వడం ఇదే ప్రథమం. అలాగే, ఇందులోని అన్ని వేరియంట్లకు ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి.

Kia Sonet Variants: ఇవే వేరియంట్స్

కియా సోనెట్ లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ 2024 మోడల్ లో మొత్తం 7 వేరియంట్లు ఉన్నాయి. అవి HTX, HTX+, GTX+ trims; X-Line, HTK, HTK+, HTE. వీటిలో టాప్ ఎండ్ వేరియంట్ HTX కాగా, బేస్ వేరియంట్ HTE. కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ 2024 మోడల్ లో మొత్తం 3 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ (82bhp, 115 Nm), 1.0-లీటర్ టర్బో యూనిట్ (118bhp, 172Nm), 1.5-లీటర్ డీజిల్ యూనిట్ (114bhp, 250Nm).

Features: ఫీచర్స్

ఈ కారులో 10.25-అంగుళాల మెయిన్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ఒక LCD డ్రైవర్ డిస్‌ప్లే యూనిట్ (10.5-అంగుళాలు), 360-డిగ్రీ కెమెరా, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, 7-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఎనిమిది సింగిల్-టోన్ కలర్లలో, రెండు డ్యూయల్-టోన్ (నలుపు పైకప్పుతో ఎరుపు మరియు నలుపు పైకప్పుతో తెలుపు) రంగుల్లో, ఒక మాట్ షేడ్ (X లైన్ కోసం ప్రత్యేకమైనది) కలర్ లలో లభిస్తుంది. సింగిల్ టోన్ కలర్స్ లో నలుపు, నీలం, క్లియర్ వైట్, గ్రే, ఆలివ్, రెడ్, సిల్వర్, వైట్ ఉన్నాయి.

తదుపరి వ్యాసం