తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Ev9 India Launch : ఇండియాలో కియా ఈవీ9 లాంచ్​పై సూపర్​ అప్డేట్​..

Kia EV9 India launch : ఇండియాలో కియా ఈవీ9 లాంచ్​పై సూపర్​ అప్డేట్​..

Sharath Chitturi HT Telugu

18 December 2023, 14:32 IST

    • Kia EV9 India launch : ఇండియాలోకి కియా ఈవీ9 వచ్చేసింది! ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ లాంచ్​పై సంస్థ కీలక అప్డేట్​ ఇచ్చింది.
ఇండియాలో కియా ఈవీ9 లాంచ్​పై సూపర్​ అప్డేట్​..
ఇండియాలో కియా ఈవీ9 లాంచ్​పై సూపర్​ అప్డేట్​..

ఇండియాలో కియా ఈవీ9 లాంచ్​పై సూపర్​ అప్డేట్​..

Kia EV9 India launch : ఇండియాలో కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ కోసం నిరీక్షణకు తెరపడనుంది! ఈ 3- రో ఎలక్ట్రిక్​ వెహికిల్​ని 2024లో లాంచ్​ చేయనున్నట్టు.. కియా మోటార్స్​ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ వచ్చేస్తోంది..

ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. దీనిని క్యాష్​ చేసుకునేందుకు దేశ, విదేశ ఆటోమొబైల్​ సంస్థ పోటీపడుతున్నాయి. అయితే.. ఇండియాలో కియాకు ఇప్పటివరకు ఒక్కటే ఈవీ ఉంది. అది.. కియా ఈవీ6. ఇక ఈవీ9 కూడా యాడ్​ అయితే.. సంస్థకు చెందిన ఈవీ పోర్ట్​ఫోలియో మరింత బలంగా తయారవుతుంది.

ఈ కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని.. 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించింది కియా మోటార్స్​. అప్పటి నుంచి ఈ మోడల్​పై మంచి బజ్​ నెలకొంది. వాస్తవానికి.. 2025లో ఈ మోడల్​ని లాంచ్​ చేస్తామని, ఆ సమయంలో చెప్పింది కియా మోటార్స్​. కానీ ఇప్పుడు.. ఆ టైమ్​ని 2024లోకి తీసుకొచ్చింది. టాటా మోటార్స్​ ఆధిపత్యం అధికంగా ఉన్న ఇండియా ఈవీ సెగ్మెంట్​లో 15శాతం మార్కెట్​ వాటాను సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తోంది కియా మోటార్స్​. ఈ టార్గెట్​లో భాగంగానే.. కియా ఈవీ9ని ఇండియాలోకి తీసుకొస్తొంది. అంతేకాకుండా.. రానున్న 3ఏళ్లల్లో.. మూడు కొత్త మోడల్స్​ని కూడా లాంచ్​ చేస్తామని, వీటిల్లో రెండు ఈవీలు ఉంటాయని స్పష్టం చేసింది.

Kia EV9 Price in India : ఈవీ6ని తయారు చేసిన ఎలక్ట్రిక్​ గ్లోబల్​ మాడ్యులర్​ ప్లాట్​ఫామ్​పైనే ఈ ఈవీ9 కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 541 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో 150 కిలోవాట్​ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుంది. 0-100 కేఎంపీహెచ్​ని కేవలం 9.4 సెకన్లలో అందుకోగలుగుతుంది. కియా ఈవీ9లో ఆర్​డబ్ల్యూడీ వర్షెన్​ కూడా ఉంది. ఇందులో పవర్​ఫుల్​ 160 కిలోవాట్​ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుంది.

ఈ ఈవీని అల్ట్రా-ఫాస్ట్​ స్పీడ్​తో ఛార్జ్​ చేయవచ్చు. అంటే.. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్​తో దాదాపు 240 కి.మీల దూరం ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది!

Kia EV9 launch in India : కియా ఈవీ9 టాప్​ ఎండ్​ వేరియంట్​ పేరు జీటీ-లైన్​. ఇందులో సరికొత్త టెక్నాలజీతో పాటు లెవల్​ 3 అడాస్​ సెటప్​ ఉంటుంది. డ్రైవింగ్​ పైలెట్​ ఫీచర్​తో.. జాతీయ రహదారులపై మనం డ్రైవ్​ చేయాల్సిన అవసరమే ఉండదు! భద్రత కోసం 15 సెన్సార్​లు, 360 డిగ్రీ ఫీల్డ్​ వ్యూ కెమెరా వంటివి కూడా ఇందులో ఉంటాయి.

కియా ఈవీ9 ధర ఎంత?

కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ధరకు సంబంధించిన వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కాగా.. ఇండియాలో ఉన్న కియా ఈవీ6 ఎక్స్​షోరూం ధర రూ. 60.95లక్షలు- 65.95లక్షల మధ్యలో ఉంటుంది. చూస్తే.. ఈవీ9 ధర.. ఈవీ6కి తగ్గట్టు లేదా దాని కన్నా కాస్త ఎక్కువే ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

KIA EV9 India price : మరోవైపు సరికొత్త కియా కార్నివాల్​పైనా అప్డేట్​ ఇచ్చింది సంస్థ. 2024లోనే దీనిని ఇండియాలోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది. ఇటీవలే.. ఈ ఎంపీవీని అంతర్జాతీయ మార్కెట్​లో రివీల్​ చేసింది సంస్థ. ​

తదుపరి వ్యాసం