తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Indusind Bank Nexxt Credit Card : ప్రతి నెల.. ఫ్రీగా సినిమా టికెట్లు కావాలా? ఇది మీకోసమే!

IndusInd Bank Nexxt credit card : ప్రతి నెల.. ఫ్రీగా సినిమా టికెట్లు కావాలా? ఇది మీకోసమే!

Sharath Chitturi HT Telugu

21 May 2023, 7:26 IST

    • IndusInd Bank Nexxt credit card benefits : మీరు సినిమాలు ఎక్కువ చూస్తుంటారా? ఫ్రీగా టికెట్లు దొరికితే ఎంత బాగుండూ అనుకుంటారా? అయితే.. నెలకు రెండు టికెట్లు ఫ్రీగా పొందే అవకాశం మీకు వచ్చింది. పూర్తి వివరాలు..
నెలకు రెండు సినిమా టికెట్లు ఉచితంగా పొందండి ఇలా..!
నెలకు రెండు సినిమా టికెట్లు ఉచితంగా పొందండి ఇలా..!

నెలకు రెండు సినిమా టికెట్లు ఉచితంగా పొందండి ఇలా..!

IndusInd Bank Nexxt credit card benefits : సినిమా అంటే చాలా మందికి ఒక ఎమోషన్​. వీరిలో మీరూ ఒకరా? మీరు సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? 'ఫ్రీగా టికెట్లు దొరికితే బాగుండు..!' అని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే మీరు ఇది మిస్​ అవ్వకండి. మీరు నెలకు రెండు సినిమా టికెట్లు.. అంటే ఏడాదికి 24 టికెట్లు ఉచితంగా పొందే ఛాన్స్​ ఇది! ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నెక్స్ట్​ క్రెడిట్​ కార్డ్​తో మీరు సినిమా టికెట్లు ఉచితంగా పొందవచ్చు. అంతేకాకుండా.. ఈ క్రెడిట్​ కార్డులో ఎగ్జైటింగ్​ బెనిఫిట్స్​ కూడా ఉన్నాయి. వాటిని చూసేద్దాము..

ట్రెండింగ్ వార్తలు

WhatsApp design: వాట్సాప్ డిజైన్ పూర్తిగా మారబోతోంది.. కొత్త కలర్స్, కొత్త ఐకన్స్, కొత్త టూల్స్..

Kia car: కస్టమర్ల కోసం లైవ్ కన్సల్టింగ్ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చిన కియా

Retirement planning: రిటైర్మెంట్ తరువాత జీవితాన్ని హాయిగా గడపాలా? ఈ ‘3 బకెట్ స్ట్రాటెజీ’ని ఫాలో కండి..

Virat Kohli: త్వరలో మార్కెట్లోకి విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన ‘గో డిజిట్’ ఐపీఓ; ఈ ఐపీఓతో కోహ్లీకి కళ్లు చెదిరే లాభం

ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నెక్స్ట్​ క్రెడిట్​ కార్డు- బెనిఫిట్స్​..

వెల్కమ్​ బెనిఫిట్​:- ఈ క్రెడిట్​ కార్డును తీసుకుంటే మీకు వెల్కమ్​ గిఫ్ట్స్​ వస్తాయి. ఈజీడైన్​, బాటా, మాంట్​బ్లాంక్​, ఒబెరాయ్​ హోటల్స్​, యాత్ర, ఆల్డో వంటి మార్చంట్స్​లో ఒకటిని ఎంచుకోవాలి.

రివార్డ్స్​:- ఈ క్రెడిట్​ కార్డుపై రూ. 150 ఖర్చు చేసిన ప్రతిసారి మీకు 1 రివార్డ్​ పాయింట్​ లభిస్తుంది. ఈ 1 రివార్డ్​ పాయింట్​ విలువ రూ.1. ఎన్ని ఎక్కువ రివార్డ్​ పాయింట్స్​ ఉంటే.. అంత ఎక్కువ డబ్బులు ఉన్నట్టు! అనంతరం మీరు ఎదైనా వస్తువును కొనుగోలు చేసుకోవచ్చు.

Free movie tickets credit card : సినిమా టికెట్లు:- ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నెక్స్ట్​ క్రెడిట్​ కార్డు ఉంటే.. మీకు నెలకు రెండు సినిమా టికెట్లు ఉచితంగా లభిస్తాయి.

బీమా కవరేజీ:- ఈ క్రెడిట్​ కార్డుతో కాంప్లిమెంటరీ ఇన్ష్యూరెన్స్​ కవరేజీ కూడా వస్తోంది. ఒకవేళ క్రెడిట్​ కార్డు పోతే.. టోటల్​ ప్రొటెక్ట్​ ప్రోగ్రామ్​ కింద మీ క్రెడిట్​ లిమిట్​ మొత్తాన్ని ఆఫర్​ చేస్తారు. దీనితో పాటు పర్సనల్​ ఎయిర్​ యాక్సిడెంట్​ కవరేజీ కింద రూ. 25లక్షల వరకు ఇస్తారు.

ఇండస్​ఇండ్​ అసిస్టెన్స్​:- ప్రీ ట్రిప్​ అసిస్టెన్స్​, ఫ్లైట్​ బుకింగ్​ అసిస్టెన్స్​, హోటల్​ రిజర్వేషన్స్​, స్పోర్ట్స్​- ఎంటర్​టైన్​మెంట్​ బుకింగ్స్​, ఎక్స్​క్లూజివ్​ బుకింగ్స్​, ఫ్లవర్​- గిఫ్ట్స్​ వంటి వాటిల్లో మీకు అసిస్టెన్స్​ సైతం లభిస్తుంది. ఇందుకోసం ఇంటర్నేషనల్​ ఎక్స్​పర్ట్​ టీమ్స్​ ఉన్నాయి.

ఫ్యూయెల్​ సర్​ఛార్జ్​:- ఈ కార్డుతో రూ. 400- రూ. 4000 వరకు ఫ్యూయెల్​కు ఖర్చు చేస్తే.. దానిపై మీకు 1శాతం వరకు సర్​ఛార్జ్​ మినహాయింపు లభిస్తుంది.

ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నెక్స్ట్​ క్రెడిట్​ కార్డు- ఫీజులు..

జాయినింగ్​ ఫీజు:- రూ. 3,499

యాన్యువల్​ ఫీజు:- 0

క్రెడిట్​పై పడే వడ్డీ:- 3.83శాతం (వార్షికంగా 46శాతం)

లేట్​ పేమెంట్​ ఛార్జీలు (ఔట్​స్టాండింగ్​ అమౌంట్​పై):-

రూ. 100 వరకు- 0

IndusInd Bank Nexxt credit card annual fee : రూ. 101- రూ. 500 వరకు- రూ .100

రూ. 501- రూ. 1000 వరకు- రూ .350

రూ. 1001- రూ. 10000 వరకు- రూ .550

రూ. 10001- రూ. 25000 వరకు- రూ .800

రూ. 25001- రూ. 50000 వరకు- రూ .1100

రూ. 50వేలు అంత కన్నా ఎక్కువ- రూ. 1,300

ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నెక్స్ట్​ క్రెడిట్​ కార్డు- ఎలిజెబులిటీ..

IndusInd Bank Nexxt credit card : ఈ క్రెడిట్​ కార్డు తీసుకోవాలని భావిస్తున్న వ్యక్తి కనీస వయస్సు 21ఏళ్లుగా ఉండాలి. గరిష్ఠంగా 65ఏళ్ల వయస్సు ఉండాలి. వీరికి యాక్టివ్​ క్రెడిట్​ హిస్టరీ ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్​, అడ్రెస్​ ప్రూప్​, ఇన్​కమ్​ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం