IndusInd Bank Q3 results: ఇండస్ ఇండ్ బ్యాంక్ కు లాభాల పంట-indusind bank q3 pat up to 1 959 crore rupees gross npa provisions decline ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Indusind Bank Q3 Results: ఇండస్ ఇండ్ బ్యాంక్ కు లాభాల పంట

IndusInd Bank Q3 results: ఇండస్ ఇండ్ బ్యాంక్ కు లాభాల పంట

HT Telugu Desk HT Telugu
Jan 18, 2023 09:55 PM IST

IndusInd Bank Q3 results: ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (FY23Q3) ఫలితాలను బుధవారం ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలను మించి లాభాలను ఆర్జించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: Bloomberg)

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3)లో ఇండస్ ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) మంచి లాభాలను ఆర్జించింది. పన్ను అనంతర లాభాల్లో (PAT), గత ఆర్థిక సంవత్సరం Q3 తో పోలిస్తే, 68.71% వృద్ధిని కనబర్చింది. ఈ Q3 లో ఇండస్ ఇండ్ (IndusInd Bank) PAT రూ. 1,959.20 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం Q3 లో ఇండస్ ఇండ్ బ్యాంక్ PAT రూ. 1,161.27 కోట్లు.

IndusInd Bank Q3 results: మెరుగైన పనితీరు

ఇండస్ ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) ఈ Q3 లో ఓవరాల్ గా అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరును కనబర్చింది. నిరర్ధక ఆస్తులను, ఇతర ఖర్చులను గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఈ ఆర్థిక సంవత్సరం Q2 (FY23Q2)లో ఇండస్ ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) రూ. 1,786.72 కోట్ల పన్ను అనంతర లాభాలను(PAT) ఆర్జించింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరం Q2 కన్నా Q3లో బ్యాంక్ PAT 9.65% అదనంగా సముపార్జించింది.

IndusInd Bank Q3 results: నికర వడ్డీ ఆదాయం

ఈ త్రైమాసికంలో బ్యాంక్ (IndusInd Bank) నికర వడ్డీ ఆదాయం (net interest income (NII) కూడా 18.5% పెరిగింది. ఈ Q3FY23 లో నికర వడ్డీ ఆదాయం రూ. 4,495.34 కోట్లు. ఇది గత Q3FY22లో రూ. 3,793.57 కోట్లు. అలాగే, ఈ Q2 లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (net interest income (NII) రూ. 4,302.05 కోట్లు. నికర వడ్డీ మార్జిన్ (Net interest margin NIM) కూడా ఈ Q3 లో 4.27% కాగా, Q2 లో అది 4.24% . బ్యాంక్ (IndusInd Bank) నిర్వహణ ఖర్చుల్లోనూ గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఈ Q3 లో ఈ ఖర్చులు రూ. 1,064.73 కోట్లు కాగా, గత Q3లో అవి రూ. 1,654.20 కోట్లు. అంటే నిర్వహణ ఖర్చులు, ఇతర అత్యవసర ఖర్చులలో 35.63% తగ్గుదల నమోదైంది. నిరర్ధక ఆస్తుల విషయానికి వస్తే.. ఈ Q3లో రూ. 5,710.78 కోట్ల విలువైన ఎన్ఫీఏ లు ఉండగా, అవి గత సంవత్సరం Q3లో రూ. 5,779.27 కోట్లు.

WhatsApp channel

టాపిక్