తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Creta N Line : రేపే హ్యుందాయ్​ క్రేట్​ ఎన్​ లైన్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Hyundai Creta N Line : రేపే హ్యుందాయ్​ క్రేట్​ ఎన్​ లైన్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu

10 March 2024, 16:30 IST

    • Hyundai Creta N Line India launch : హ్యుందాయ్​ క్రేట్​ ఎన్​ లైన్​ సోమవారం లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ ఫీచర్స్​ వివరాలు మీకోసం..
హ్యుందాయ్​ క్రేట్​ ఎన్​ లైన్​ లాంచ్ రేపే!
హ్యుందాయ్​ క్రేట్​ ఎన్​ లైన్​ లాంచ్ రేపే!

హ్యుందాయ్​ క్రేట్​ ఎన్​ లైన్​ లాంచ్ రేపే!

Hyundai Creta N Line price in India : హ్యుందాయ్ మోటార్ ఇండియా.. తన మూడొవ ఎన్ లైన్ మోడలైన.. క్రెటా ఎన్​ లైన్​ని సోమవారం లాంచ్​ చేయనుంది. క్రెటా లైనప్​లో ఫ్లాగ్​షిప్​ వేరియంట్​గా ఉంటుంది ఈ ఎన్​ లైన్​! ఈ మోడల్​ బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 25వేల టోకెన్​ అమౌంట్​తో ఈ ఎస్​యూవీని బుక్​ చేసుకోవచ్చు. క్రేటా ఎన్​ లైన్​.. ఇప్పటికే డీలర్​షిప్​ షోరూమ్స్​కి కూడా చేరుకుంది.

హ్యుందాయ్​ క్రేటా ఎన్​ లైన్​..

క్రెటా ఎన్ లైన్.. రెండు ట్రిమ్స్​లో వస్తుంది. అవి.. ఎన్ 8, ఎన్ 10. ఇవి.. స్టాండర్డ్ క్రెటా ఎస్​యూవీలోని ఎస్ఎక్స్ (టెక్) - ఎస్ఎక్స్ (ఓ) ట్రిమ్స్​తో సమానం. టర్బో-డీసీటీతో క్రెటా ఎస్ఎక్స్(ఓ) ప్రస్తుత ధర రూ .20 లక్షలు, టర్బో-డీసీటీతో క్రెటా ఎన్ లైన్ ఎన్​10 వేరియంట్ ధర రూ. 20.50 లక్షల నుంచి రూ. 20.60 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. మాన్యువల్ వేరియంట్ కొంచెం చౌకగా ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

క్రెటా టర్బో పెట్రోల్ యూనిట్ మాదిరిగానే.. ఎన్ లైన్ మోడల్​లో 1.5-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్​ ఉంటుంది. ఇది 160 బీహెచ్​పీ పవర్​ని 253 ఎన్ఎమ్ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ 7 స్పీడ్ డీసీటీతో వస్తుంది. ఎన్ లైన్ 6స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ కూడా అందిస్తుంది.

Hyundai Creta N Line launch date in India : కాస్త ఎక్కువ ఖర్చు చేస్తే.. క్రెటా ఎన్ లైన్ కాస్మొటిక్, మెకానికల్స్​ని మెరుగుపరుచుకోవచ్చు. ఎక్స్​టీరియర్​ డిజైన్ డబ్ల్యూఆర్సీ కార్ల స్ఫూర్తితో రూపొందించినట్లు హ్యుందాయ్ తెలిపింది. కియా సెల్టోస్ ఎక్స్-లైన్, స్కోడా కుషాక్ మోంటే కార్లో వంటి మోడళ్లకు పోటీగా.. ప్రత్యేక ఎడిషన్ క్రెటా ఎన్-లైన్ పెయింట్ స్కీమ్స్, ఫ్రంట్- రేర్​ బ్యాడ్జింగ్, కొత్త స్పోర్టీ ఫ్రంట్ గ్రిల్, రెడ్​ యాక్సెట్​తో మరింత అగ్రెసివ్​ ఫ్రంట్ బంపర్​, రెడ్​ యాక్సెంట్​తో సైడ్ స్కర్ట్​లను కలిగి ఉంటుంది. ఎన్ లైన్-స్పెసిఫిక్ 18-ఇంచ్​ వీల్స్​ వస్తున్నాయి. స్టాండర్డ్​ మోడల్​లో ఇది ఉండదు.

రేర్​లో.. స్టాండర్డ్ క్రెటాతో పోలిస్తే కొత్త ట్విన్-టిప్ ఎగ్జాస్ట్ మరింత ఆకర్షణీయమైన సౌండ్​ని అందిస్తుందని భావిస్తున్నారు. అదనంగా.. హ్యుందాయ్ ఎస్​యూవీ హ్యాండ్లింగ్​ను మెరుగుపరచడానికి సస్పెన్షన్ సెటప్​ను పెంచే అవకాశం ఉంది.

Hyundai Creta N Line price : ఇతర ఎన్ లైన్ మోడల్స్​తో జతచేసిన హ్యుందాయ్​ క్రెటా ఎన్ లైన్​లో ఎన్ లైన్-స్పెసిఫిక్ స్టీరింగ్ వీల్, ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​, సీట్లపై రెడ్ పైపింగ్, గేర్ లివర్, స్టీరింగ్ వీల్ ఉంటాయి. టాప్-స్పెక్ క్రెటా ఎస్ఎక్స్ (ఓ) ఆధారంగా, ఎన్ లైన్​లో 360-డిగ్రీ కెమెరా, లెవల్ -2 ఏడీఏఎస్, డ్యూయల్ డిజిటల్ డిస్​ప్లే, పవర్డ్ డ్రైవర్ సీట్​, రియర్-సీట్ రెక్లైన్, ఎఈడీ లైటింగ్ ప్యాకేజీ వంటి ఫీచర్లు ఉంటాయి.

ఈ హ్యుందాయ్​ క్రేటా ఎన్​ లైన్​ ధర, ఫీచర్స్​పై లాంచ్​ టైమ్​లో అధికారిక ప్రకటన వస్తుంది.

తదుపరి వ్యాసం