తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fastags : అలర్ట్​.. ఏప్రిల్​ నుంచి మీ ఫాస్టాగ్స్​ పని చేయవు! కారణం ఇదే..

FASTags : అలర్ట్​.. ఏప్రిల్​ నుంచి మీ ఫాస్టాగ్స్​ పని చేయవు! కారణం ఇదే..

Sharath Chitturi HT Telugu

09 February 2024, 11:10 IST

    • GPS toll collection system : ఏప్రిల్​ నుంచి ఫాస్టాగ్స్​ పనిచేయకపోవచ్చు. ఇందుకు ఓ కారణం ఉంది. జీపీఎస్​ ఆధారిత టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని ఏప్రిల్​ నాటికి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తుండటం ఇందుకు కారణం!
అలర్ట్​.. ఏప్రిల్​ నుంచి మీ ఫాస్టాగ్స్​ పని చేయవు! కారణం ఇదే..
అలర్ట్​.. ఏప్రిల్​ నుంచి మీ ఫాస్టాగ్స్​ పని చేయవు! కారణం ఇదే.. (HT_PRINT)

అలర్ట్​.. ఏప్రిల్​ నుంచి మీ ఫాస్టాగ్స్​ పని చేయవు! కారణం ఇదే..

What is GPS toll collection system : దేశంలో ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్​ వ్యవస్థ స్థానంలో జీపీఎస్​ ఆధారిత ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని తీసుకురావాలని.. కేంద్రం గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ. ఆయన మాటలు వింటుంటే.. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి ఫాస్టాగ్స్​ పని చేయవు అన్న సూచనలు కనిపిస్తున్నాయి!

ట్రెండింగ్ వార్తలు

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

ఏప్రిల్​ నుంచి ఫాస్టాగ్స్​ పని చేయవా?

ఇంకొన్ని నెలల్లో దేశంలో 2024 లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఎలక్షన్​ కోడ్​ అమల్లోకి వచ్చే ముందు.. దేశవ్యాప్తంగా జీపీఎస్​ ఆధారిత ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని అమలు చేయాలని భావిస్తున్నట్టు నితిన్​ గడ్కరీ తెలిపారు. అంటే.. ఈ కొత్త వ్యవస్థ ఏప్రిల్​ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. కేంద్రం ఇప్పటికే ఓ కన్సల్టెంట్​ని కూడా నియమించినట్టు వివరించారు.

FASTags removal in India : ఫాస్టాగ్​ వ్యవస్థ కూడా పాతదేమీ కాదు. 2021లో.. ప్రతి వాహనానికి ఫాస్టాగ్​ ఉండాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఫాస్టాగ్​ లేని వాహనాలు.. డబుల్​ టోల్​ కట్టాలని చెప్పుకొచ్చింది. అయితే.. జీపీఎస్​ ఆధారిత ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని అమలు చేసి, ఫాస్టాగ్​ వ్యవస్థని దశల వారీగా తొలగించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.

ఈ కొత్త వ్యవస్థలో.. ఆటోమెటిక్​ నెంబర్​ ప్లేట్​ రికగ్నీషన్​ సిస్టెమ్​ ఉంటుంది. హైవేలపై కెమెరాలు అమర్చి ఉంటాయి. వాహనం ప్రయాణించిన దూరాన్ని బట్టి.. టోల్​ కట్​ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్​లు.. ఆర్​ఎఫ్​ఐడీ ఆధారిత టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని ఫాలో అవుతున్నాయి.

GPS toll collection system India : వాస్తవానికి.. జీపీఎస్​ ఆధారిత టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని ఈ ఏడాది మార్చ్​ నాటికి అమలు చేయాలని చూస్తున్నట్టు నితిన్​ గడ్కరీ గతేడాది చెప్పారు.

"టోల్​ విషయంలో కొత్త టెక్నాలజీ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జీపీఎస్​ ఆధారిత్​ టోల్​ సిస్టెమ్​ని తీసుకురావాలని చూస్తున్నాము. ఇది శాటిలైట్​తో ముడిపడిన విషయం. మార్చ్​ నాటకి అమలు చేయాలని చూస్తున్నాము," అని నితన్​ గడ్కరీ ఓ సందర్భంలో అన్నారు. ఇప్పుడు.. ఇది ఏప్రిల్​లో అమలవుతుందని వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి.. ఈ జీపీఎస్​ ఆధారిత టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని పైలట్​ ప్రాజెక్ట్​ కింద పలు జాతీయ రాహదారులపై అమలు చేసింది ప్రభుత్వం. టెస్ట్​ రన్​ ముగిసిన తర్వాత.. దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించింది.

జీపీఎస్​ ఆధారిత టోల్​ కలెక్షన్​ ఎలా పనిచేస్తుంది?

GPS toll collection system process : వెహికిల్​ నెంబర్​ ప్లేట్​ని.. రహదారులపై ఉన్న కెమెరాలు స్కాన్​ చేస్తాయి. ఆ తర్వాత.. టోల్​ ఛార్జీలు కట్​ అవుతాయి. నెంబర్​ ప్లేట్స్​ అనేవి.. టోల్​ ఛార్జీలు వసూలు చేసే అకౌంట్స్​కి లింక్​ అయ్యి ఉంటాయి. ఇందులో ఉండే ఆటోమెటిక్​ నెంబర్​ ప్లేట్​ రికగ్నీషన్​ సిస్టెమ్​ చాలా కీలకం.

ఒకప్పుడు.. టోల్స్​ని వసూలు చేయడం కోసం టోల్​ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సి వచ్చేది. డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. వెనుక లైన్​ చాలా పెరిగిపోయేదు. రద్దీని తగ్గించేందుకే ఫాస్టాగ్స్​ సిస్టెమ్​ని ప్రవేశపెట్టారు. వాహనానికి యటాచ్​ అయ్యి ఉండే ఫాస్టాగ్​ని టోల్​ ప్లాజాల వద్ద స్కాన్​ చేస్తారు. డబ్బులు కట్​ అవుతాయి. 2018-19 లో టోల్​ ప్లాజాల వద్ద 8 నిమిషాలుగా ఉన్న వెయిటింగ్​ టైమ్​.. ఫాస్టాగ్స్​ వల్ల 47 సెకన్లకు దిగొచ్చింది.

ఇక ఇప్పుడు.. జీపీఎస్​ ఆధారిత ఎలక్ట్రానిక్​ కలెక్షన్​ వ్యవస్థ అమల్లోకి వస్తే.. అసలు టోల్​ ప్లాజా అవసరమే ఉండదని తెలుస్తోంది. హైవేలపై ఉండే కెమెరాల ద్వారానే.. టోల్​ కట్​ అవుతుంది!

అయితే.. ఏప్రిల్​ నుంచే ఈ కొత్త సిస్టెమ్​ అమల్లోకి వస్తుందా? లేదా ఇంకా సమయం పడుతుందా? అనేది ప్రభుత్వం అధికారికంగా చెప్పాల్సి ఉంది.

తదుపరి వ్యాసం