తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pay App To Be Discontinued : అలర్ట్​.. గూగుల్​ పే ఇక పనిచేయదు!

Google Pay app to be discontinued : అలర్ట్​.. గూగుల్​ పే ఇక పనిచేయదు!

Sharath Chitturi HT Telugu

26 February 2024, 17:17 IST

  • Google Pay app to be discontinued : పేమెంట్స్​ యాప్​ గూగుల్​ పే.. ఇంకొన్ని నెలల తర్వాత పనిచేయదని స్పష్టం చేసింది దిగ్గజ్​ టెక్​ సంస్థ గూగుల్​. అయితే.. ఇది ఇండియాలో కాదు!

అలర్ట్​.. గూగుల్​ పే ఇక పనిచేయదు!
అలర్ట్​.. గూగుల్​ పే ఇక పనిచేయదు! (HT Tech)

అలర్ట్​.. గూగుల్​ పే ఇక పనిచేయదు!

Google Pay app shutting down : అమెరికా ప్రజలకు కీలక సూచనలు ఇచ్చింది టెక్​ దిగ్గజం గూగుల్​. తమ పేమెంట్స్​ యాప్​.. "గూగుల్​ పే"ని డిస్కంటిన్యూ చేస్తున్నట్టు వెల్లడించింది. 2024 జూన్​ 4 తర్వాత.. యాప్​ ఇక అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. గూగుల్​ పే యూజర్లు.. గూగుల్​ వాలెట్​కు షిఫ్ట్​ అవ్వాలని పిలుపునిచ్చింది. డిజిటల్​ పేమెంట్స్​, ట్రాన్సాక్షన్స్​ కోసం ఇక నుంచి గూగుల్​ వాలెట్​ యాప్​ తమ ప్రైమరీ ప్లాట్​ఫామ్​ అవుతుందని పేర్కొంది.

గూగుల్​ పే డిస్కంటిన్యూ..

ప్రపంచవ్యాప్తంగా.. అనేక దేశాల్లో గూగుల్​ పే సేవలు అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో సైతం చాలా మంది ఈ యాప్​నకు అలవాటు పడిపోయారు. గూగుల్​ తాజా నిర్ణయం.. వారిపై ప్రభావం చూపిస్తుంది. ఇక జున్​ 4 తర్వాత.. గూగుల్​ పేని తొలగిస్తే, పీర్​-టు-పీర్​ పేమెంట్స్​, ఆఫర్​ డిస్కవరీ, బ్యాలెన్స్​ మేనేజ్​మెంట్​ వంటి సేవలు పనిచేయవు.

అయితే.. అమెరికాలో మాత్రమే గూగుల్​ పే పనిచేయదు. ఇండియా, సింగపూర్​తో పాటు వివిధ దేశాల్లోని గూగుల్​ పే యూజర్స్​పై సంస్థ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించదు.

Google pay app to be discontinued in June : గూగుల్​కు చెందిన ఫ్లాగ్​షిప్​ సర్వీస్​ గూగుల్​ వాలెట్​లో సెక్యూరిటీ ఫీచర్స్​ ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. పేమెంట్​ కార్డ్స్​, ట్రాన్సిట్​ పాసెస్​, ఐడీ-డ్రైవింగ్​ లెన్స్​లు వంటి ఐడెంటిఫికేషన్​ డాక్యుమెంట్స్​కు ఇది సెక్యూర్​ రిపాసిటరీగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. అమెరికాలో గూగుల్​ పే కన్నా గూగుల్​ వాలెట్​ని వాడుతున్న వారు 5రెట్లు ఎక్కువగా ఉన్నారట. కంపెనీ పేమెంట్​ ఈకోసిస్టెమ్​లో గూగుల్​ వాలెట్​ది అత్యంత కీలక పాత్ర!

ఇక.. గూగుల్​ పే అకౌంట్స్​లో డబ్బులు ఉండిపోతే.. వాటిని జూన్​ 4లోగా తిరిగి బ్యాంకుల్లోకి ట్రాన్స్​ఫర్​ చేసుకోవాలని సంస్థ వెల్లడించింది. గూగుల్​ పేలో కనిపించే డిస్కౌంట్స్​, డీల్స్​, ఆఫర్స్​ని మిస్​ అయిపోతామని బాధపడాల్సిన అవసరం లేదని.. వాటిని గూగుల్​ సెర్చ్​లో ఇంటిగ్రేట్​ చేస్తామని, డీల్స్​కి సపరేట్​ సెక్షన్​ కేటాయిస్తామని టెక్​ దిగ్గజం స్పష్టం చేసింది.

Google pay latest news : గూగుల్​ పే సేవలు నిలిచిపోతే కొంతమంది యూజర్లకు స్వల్ప కాలంలో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. కానీ గూగుల్​ వాలెట్​కి స్విచ్​ అయితే.. మెరుగైన సెక్యూరిటీ లభిస్తుంది. డిజిటల్​ ట్రాన్సాక్షన్​ సేవలు మరింత మెరుగుపడతాయి. పేమెంట్స్​ని మరింత సులభతం చేసేందుకు గూగుల్​ సంస్థ.. గూగుల్​ వాలెట్​కి భవిష్యత్తులో మరిన్ని ఫీచర్స్​ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో.. అమెరికా ప్రజలు.. గూగుల్​ పే వాలెట్​లో డబ్బులు పెట్టుకుని ఉంటే.. వాటిని ట్రాన్స్​ఫర్​ చేసుకునేందుకు జూన్​ 4 డెడ్​లైన్​ ఉందని గుర్తుపెట్టుకోవాలి.

"2024 జూన్​ 2 తర్వాత.. గూగుల్​ పే ద్వారా మీరు డబ్బులను పొందలేరు, పంపలేరు. అమెరికాలో ఉన్న గూగుల్​ పే వర్షెన్​కి ఇది వర్తిస్తుంది," అని ఓ పోస్ట్​లో పేర్కొంది గూగుల్​. గూగుల్​ ప్లే నుంచి గూగుల్​ వాలెట్​ యాప్​ని డౌన్​లోడ్​ చేసుకోవాలని స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం