WhatsApp Privacy Checkup: వాట్సాప్ వాడుతున్నారా?.. మరి ప్రైవసీ చెక్ అప్ చేసుకున్నారా?.. చాట్ సెక్యూరిటీకి చాలా ముఖ్యం
WhatsApp Privacy Checkup: వాట్సాప్ ఇప్పుడు నిత్యావసరం. వ్యక్తిగత, వృత్తిగత అవసరాలకు వాట్సాప్ తప్పనిసరి. కానీ, వాట్సాప్ లో మీ డేటా, మీ చాట్స్ సేఫేనా?.. మీ వాట్సాప్ ప్రైవసీని ఇలా మరింత పెంచుకోండి.
WhatsApp Privacy Checkup: వాట్సాప్ యూజర్ల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అందులో కొన్ని యూసేజ్ ఫీచర్స్ అయితే, మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్స్. వాట్సాప్ యూజర్ల ప్రైవసీని మరింత కట్టుదిట్టం చేయడం కోసం ఇటీవల వాట్సాప్ కాల్స్ సమయంలో ఐపీ అడ్రస్ ను కనిపించకుండే చేసుకునే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కాకుండా, వాట్సాప్ లోని అన్ని ప్రైవసీ ప్రిఫరెన్సెస్ ను ఒకే చోట ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అదే ‘‘ప్రైవసీ చెకప్ (Privacy Checkup)’’
Privacy Checkup: ప్రైవసీ చెకప్
ఈ ఆప్షన్ ద్వారా వాట్సాప్ (WhatsApp) యూజర్లు తమ అకౌంట్లను సురక్షితంగా, భద్రంగా కాపాడుకోవచ్చు. ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించుకోవాలో, దీని ప్రయోజనాలేమిటో వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా (Meta) ఒక బ్లాగ్ పోస్ట్ లో వివరించింది. వాట్సాప్ లో ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్లి, ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని, తన అవసరాలకు అనుగుణంగా ప్రైవసీ ప్రిఫరెన్సెస్ ను మార్చుకోవచ్చు. మెసేజెస్, చాట్స్, పర్సనల్ డేటా.. తదితర వివరాలను భద్రపర్చుకోవచ్చు.
Privacy Checkup on WhatsApp: ఎలా యూజ్ చేసుకోవాలి?
వాట్సాప్ లోని ప్రైవసీ చెక్ అప్ లో నాలుగు ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. అవి..
- Choose who can contact you: ఈ సెట్టింగ్ ద్వారా మిమ్మల్ని వాట్సాప్ లో ఎవరు కాంటాక్ట్ చేయవచ్చో? ఎవరు ఆడియో, వీడియో కాల్స్ చేయవచ్చో? మీరే నిర్ధారించవచ్చు. తద్వారా అనవసర కాల్స్ ను నిరోధించవచ్చు. ఎవరు మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయవచ్చో కూడా మీరే నిర్ధారించవచ్చు.
- Control your personal info: వాట్సాప్ లో మీ ఆన్ లైన్ స్టేటస్, వ్యక్తిగత వివరాలు, యాక్టివిటీ, ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్, లాస్ట్ సీన్, రీడ్ రిసీట్ లను ఎవరు చూడవచ్చో ఈ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు.
- Add more privacy to your chats: వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సదుపాయం ఇప్పటికే ఉంది. అయితే, మెసేజ్ టైమర్, ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షెడ్ బ్యాక్ అప్ ల ద్వారా మీ చాట్ లకు మరింత ప్రైవసీ, సెక్యూరిటీని అందించవచ్చు.
- Add more protection to your account: తమ వాట్సాప్ ఖాతాలకు యూజర్లు మరింత ప్రొటెక్షన్ కావాలనుకుంటే, టూ స్టెప్ వెరిఫికేషన్ ను ఇనేబుల్ చేసుకోవాలి. అలాగే, ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ ను ఇనేబుల్ చేసుకోవాలి.
How to access the Privacy Checkup?: ఎలా యాక్సెస్ చేయాలి?
ఈ సెక్యూరిటీ ప్రాసెస్ ను పూర్తి చేయడం కోసం యూజర్లు ముందుగా..
- తమ వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి.
- రైట్ టాప్ కార్నర్ లోని త్రీ డాట్స్ ను క్లిక్ చేయాలి.
- డ్రాప్ డౌన్ మెన్యూలో నుంచి Settings ను సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆ తరువాత Privacy ని సెలెక్ట్ చేసుకోవాలి.
- Start Checkup ని ఎంపిక చేసుకోవాలి.
- ఒక్కో ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటూ, సెక్యూరిటీ ప్రిఫరెన్సెన్ ను ఎంచుకోవాలి.