తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pay Sound Box: త్వరలో మార్కెట్లోకి గూగుల్ పే సౌండ్ బాక్స్; వ్యాపారులకు యూజ్ ఫుల్

Google Pay Sound box: త్వరలో మార్కెట్లోకి గూగుల్ పే సౌండ్ బాక్స్; వ్యాపారులకు యూజ్ ఫుల్

HT Telugu Desk HT Telugu

24 February 2024, 19:13 IST

  • Google Pay SoundPod: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ గూగుల్ పే  (Google Pay) సొంత సౌండ్ బాక్స్ లను త్వరలో మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. గత సంవత్సరం ఈ సౌండ్ పాడ్ (SoundPod) లను గూగుల్ పే పరిమిత పైలట్ ప్రొడక్ట్ గా ప్రవేశపెట్టింది.

గూగుల్ పే సౌండ్ బాక్స్
గూగుల్ పే సౌండ్ బాక్స్

గూగుల్ పే సౌండ్ బాక్స్

Google Pay SoundPod : భారతదేశంలో గత ఏడాది పరిమితంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన గూగుల్ పే సౌండ్ బాక్స్ లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. పైలట్ విధానంలో ఈ సౌండ్ బాక్స్ లను ఉపయోగించిన వ్యాపారులు సానుకూల ఫీడ్ బ్యాక్ ను ఇచ్చారని వెల్లడించింది. ‘‘ఈ సౌండ్ పాడ్ చెక్ అవుట్ సమయాన్ని తగ్గిస్తుందని ఆ వ్యాపారులు చెప్పారు. 2017 సెప్టెంబరులో భారతదేశంలో గూగుల్ పే (Google Pay SoundPod) ప్రారంభమైంది. సురక్షితమైన డిజిటల్ చెల్లింపులతో భారతదేశ వ్యాపారులు, వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్నది’’ అని గూగుల్ పే ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ అంబరీష్ కెంఘే తెలిపారు.

గూగుల్ పే సౌండ్ బాక్స్ అంటే ఏమిటి? ఎలా పని చేస్తుంది?

(1.) సౌండ్ పాడ్ (Google Pay SoundPod) అనేది వ్యాపారులకు సహాయపడే ఒక ఆడియో పరికరం. వ్యాపారులు పేమెంట్ అందుకున్నప్పుడు ఆడియో అలర్ట్ ద్వారా చెల్లింపు లావాదేవీని ధ్రువీకరిస్తుంది.

(2.) పేమెంట్ చేయడం కొరకు, కస్టమర్ లు మర్చంట్ యొక్క అసోసియేటెడ్ QR కోడ్ ని స్కాన్ చేయాలి. పేమెంట్ విజయవంతంగా పూర్తి అయిన వెంటనే, ఈ సౌండ్ పాడ్ నుంచి ఎంత మొత్తం రిసీవ్ చేసుకున్నారో చెప్తూ ఆడియో అలర్ట్ వస్తుంది.

(3.) భారతదేశంలో, ఈ పరికరం చిన్న వ్యాపారులకు అందుబాటులో ఉంటుంది. ఇది లక్షలాది చిన్న. మధ్య తరహా వ్యాపారులకు సహాయకారిగా ఉంటుంది.

(4.) ఇప్పటికే భారత్ లో పేటీఎం, ఫోన్ పే అందించే బాక్సులు వినియోగంలో ఉన్నాయి. అయితే, పేటీఎం సంక్షోభం నేపథ్యంలో ఆ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో గూగుల్ పే ఈ దిశగా అడుగులు వేస్తోంది.

(5.) భారతదేశంలో రెండు కోట్ల మందికి పైగా వ్యాపారులు పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం ఆడియో నోటిఫికేషన్లను ఉపయోగిస్తున్నారు. ఈ సౌండ్ బాక్స్ ను తయారు చేయడానికి సుమారు రూ. 1500 నుండి రూ .1660 ఖర్చు అవుతుంది.

తదుపరి వ్యాసం