Google Pay: ఇక ‘గూగుల్ పే’ లో రూపే క్రెడిట్ కార్డ్ తో చెల్లింపులకు అవకాశం
Google Pay: ఇక గూగుల్ పే (Google Pay) యూజర్లు తమ గూగుల్ పే యాప్ లో రూపే క్రెడిట్ కార్డ్ (RuPay credit card) ను లింక్ చేసుకోవచ్చు. తద్వారా తమ గూగుల్ పే ద్వారా చేసే ఆన్ లైన్, ఆఫ్ లైన్ చెల్లింపులకు ఆ రూపే క్రెడిట్ కార్డ్ ను వాడుకోవచ్చు.
Google Pay: ఇక గూగుల్ పే (Google Pay) యూజర్లు తమ గూగుల్ పే యాప్ లో రూపే క్రెడిట్ కార్డ్ (RuPay credit card) ను లింక్ చేసుకోవచ్చు. తద్వారా తమ గూగుల్ పే (Google Pay)ద్వారా చేసే ఆన్ లైన్, ఆఫ్ లైన్ చెల్లింపులకు ఆ రూపే క్రెడిట్ కార్డ్ ను వాడుకోవచ్చు.
Google Pay: ప్రస్తుతానికి కొన్ని బ్యాంక్ ల కార్డులే..
రూపే క్రెడిట్ కార్డ్ (RuPay credit card) ను ఇప్పుడు గూగుల్ పే (Google Pay) తో అనుసంధానం చేసుకోవచ్చు. ఈ మేరకు గూగుల్ పే (Google Pay), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (National Payments Corporation of India NPCI)ల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతానికి యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కొటక్ మహింద్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డు (RuPay credit card) లను మాత్రమే గూగుల్ పే (Google Pay) యాప్ తో అనుసంధానం చేసుకోవచ్చు. క్రమంగా ఇతర బ్యాంక్ ల రూపే క్రెడిట్ కార్డు (RuPay credit card) లను కూడా అనుసంధానం చేసుకునే వీలు కల్పించనున్నారు. ఈ సదుపాయం ద్వారా గూగుల్ పే (Google Pay) వినియోగదారులకు తమ చెల్లింపులకు సంబంధించి మరిన్ని ఆప్షన్లు లభిస్తాయని గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ శరత్ బులుసు తెలిపారు.
RuPay credit card on Google Pay: అనుసంధానం ఎలా?
- తమ గూగుల్ పే (Google Pay) యాప్ నుంచి రూపే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరపాలనుకునే వినియోగదారుల వద్ద ముందుగా పైన పేర్కొన్న బ్యాంక్ ల్లో ఏదైనా బ్యాంక్ జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డ్ (RuPay credit card) ఉండి ఉండాలి.
- రూపే క్రెడిట్ కార్డు (RuPay credit card) ను యాడ్ చేసుకోవడం కోసం ముందుగా గూగుల్ పే (Google Pay) యాప్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.
- సెటప్ పేమెంట్ మెథడ్ (setup payment method) పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ (Add RuPay credit card) పై ట్యాప్ చేయాలి.
- మీ వద్ద ఉన్న రూపే క్రెడిట్ కార్డ్ (RuPay credit card) లోని చివరి ఆరు అంకెలను, ఎక్స్పైరీ డేట్ (expiry date) ను, పిన్ (pin) ను ఎంటర్ చేయాలి.
- గూగుల్ పేలో ఆ రూపే క్రెడిట్ కార్డ్ ను యాక్టివేట్ చేయడానికి గూగుల్ పే (Google Pay) ప్రొఫైల్ లోని “RuPay credit card on UPI” పై ట్యాప్ చేయాలి.
- రూపే క్రెడిట్ కార్డ్ (RuPay credit card) ను జారీ చేసిన బ్యాంక్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
- యూపీఐ పిన్ (UPI PIN) ను సెట్ చేసుకోవాలి.