తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ed Raids Hero Motocorp Chairman Pawan Munjal: హీరో మోటో కాార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ పై మనీ లాండరింగ్ కేసు; ఈడీ దాడులు

ED raids Hero Motocorp Chairman Pawan Munjal: హీరో మోటో కాార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ పై మనీ లాండరింగ్ కేసు; ఈడీ దాడులు

HT Telugu Desk HT Telugu

01 August 2023, 14:24 IST

  • ED raids Hero Motocorp Chairman Pawan Munjal: భారతదేశపు అతిపెద్ద టూ వీలర్ తయారీ దారు హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ ముంజల్ అక్రమ ఆర్థిక కార్యకలాపాలపై ఈడీ దృష్టి పెట్టింది. అతడిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. పవన్ ముంజల్ ఇంటిపై మంగళవారం దాడులు చేసింది.

హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ ముంజల్
హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ ముంజల్ (PTI)

హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ ముంజల్

ED raids Hero Motocorp Chairman Pawan Munjal: భారతదేశపు అతిపెద్ద టూ వీలర్ తయారీ దారు హీరో మోటో కార్ప్ (Hero Motocorp) సంస్థ చైర్మన్ పవన్ ముంజల్ (Pawan Munjal) అక్రమ ఆర్థిక కార్యకలాపాలపై ఈడీ దృష్టి పెట్టింది. అతడిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. పవన్ ముంజల్ ఇంటిపై మంగళవారం దాడులు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ఢిల్లీ, గురుగ్రామ్ ల్లో..

ఢిల్లీ, గురుగ్రామ్ ల్లో హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ ముంజల్ కు చెందిన ఇళ్లల్లో ఈడీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. కీలక పత్రాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్స్ సహా పలు ఎలక్ట్రానిక్ డివైజెస్ ను స్వాధీనం చేసుకున్నారు. పవన్ ముంజల్ పై పీఎంఎల్ఏ (Prevention of Money Laundering Act PMLA) కింద కేసు నమోదు చేశారు. డీఆర్ఐ (Department of Revenue Intelligence) నుంచి అందిన విశ్వసనీయ సమాచారంపై ఈడీ ఈ చర్యలు తీసుకుంది. పవన్ ముంజల్ కు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి నుంచి ఏర్ పోర్ట్ లో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని ఇటీవల డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. ఆ వ్యక్తి అందించిన సమాచారం ఆధారంగా పవన్ ముంజల్ పై చర్యలకు ఈడీ ఉపక్రమించింది.

హీరో షేర్లపై దెబ్బ..

హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ ముంజల్ పై ఈడీ దాడుల వార్త వైరల్ కావడంతో.. స్టాక్ మార్కెట్లో హీరో మోటో కార్ప్ షేర్ల విలువ భారీగా పడిపోయింది. మధ్యాహ్నం 1 గంట సమయంలోో బీఎస్ఈలో ఈ సంస్థ షేర్లు 3.45% పడిపోయి, రూ. 3092.90 వద్దకు చేరాయి. అంతకుముందే, హీరో మోటో కార్ప్ షేర్లు 52 వారాల గరిష్టమైన రూ. 3,242.85 లకు చేరడం గమనార్హం.

లాస్ట్ ఈయర్ కూడా..

పవన్ ముంజల్ పై గత సంవత్సరం ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేతకు సంబంధించిన ఒక కేసులో ఐటీ అధికారులు ఈ దాడులు చేశారు. భారత్ లో హీరో మోటో కార్ప్ అతిపెద్ద టీ వీలర్ తయారీ సంస్థ. ఈ సంస్థ ఉత్పత్తి చేసిన బైక్స్ ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాల్లోని దాదాపు 40 దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.

తదుపరి వ్యాసం