తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై.. సన్​ఫార్మా, టెక్​ మహీంద్రా షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. సన్​ఫార్మా, టెక్​ మహీంద్రా షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​

Sharath Chitturi HT Telugu

20 June 2023, 8:11 IST

    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై..
స్టాక్స్​ టు బై.. (Reuters)

స్టాక్స్​ టు బై..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 216 పాయింట్లు కోల్పోయి 63,168 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 71 పాయింట్ల నష్టంతో 18,756 వద్దకు చేరింది. 304 పాయింట్లు పడిన బ్యాంక్​ నిఫ్టీ.. 43,633 వద్ద స్థిరపడింది. కాగా.. స్మాల్​క్యాప్​, మిడ్​క్యాప్​ సూచీలు రాణించాయి.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ అప్​ట్రెండ్​లోనే ఉంది.

"నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ పాజిటివ్​గానే ఉంది. 1-2 సెషన్స్​ తర్వాత నిఫ్టీలో అప్​ట్రెండ్​ కనిపంచొచ్చు. నిఫ్టీ సపోర్ట్​ 18,670.. రెసిస్టెన్స్​ 18,900గా ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​లోని టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిసట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ దఫా పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. భారత ఆర్థిక వ్యవస్థకు కలిసివస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:- Gold ETF investment : ‘గోల్డ్​ ఈటీఎఫ్​’.. బంగారంలో ఇన్​వెస్ట్​మెంట్​కు ది బెస్ట్​ ఆప్షన్!

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1030.9 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు కూడా రూ. 365.2 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లకు సోమవారం సెలవు. ఆసియా మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.24శాతం పెరిగింది. జపాన్​ నిక్కీ 0.45శాతం మేర పతనమైంది.

స్టాక్స్​ టు బై..

సన్​ ఫార్మా:- బై రూ. 1001, స్టాప్​ లాస్​ రూ. 980, టార్గెట్​ రూ. 1043

టెక్​ మహీంద్రా:- బై రూ. 1093.60, స్టాప్​ లాస్​ రూ. 1060, టార్గెట్​ రూ. 1150

ఎంఆర్​పీఎల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 72, టార్గెట్​ రూ. 85

ఎం అండ్​ఎం ఫిన్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 304, టార్గెట్​ రూ. 330

ఇండస్​ఇండ్​ బ్యాంక్​:- బై రూ. 1300, స్టాప్​ లాస్​ రూ. 1275, టార్గెట్​ రూ. 1350

సుమిటోమో కెమికల్​ ఇండియా (సుమికెమ్​):- బై రూ. 428, స్టాప్​ లాస్​ రూ. 415, టార్గెట్​ రూ. 450

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం