Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్.. నేటి స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే
06 January 2023, 7:00 IST
- Stocks to buy today : ట్రేడర్స్ ట్రాక్ చేయాల్సిన నేటి స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
నేటి స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే..
Stocks to buy today : అంతర్జాతీయ ప్రతికూల పవనాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 304 పాయింట్ల నష్టంతో 60,353 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 50 పాయింట్లు కోల్పోయి 17,992 వద్దకు చేరింది. బ్యాంక్ నిఫ్టీ.. 350 పాయింట్ల లాస్‌తో 42,608 వద్ద ముగిసింది. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంఎసీజీ రంగాలు మినహా.. ఇతర సెక్టార్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
ఫెడ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ బయటకు రావడంతో అంతర్జాతీయ ప్రతికూల పవనాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం దిగొస్తున్నప్పటికీ.. వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందని.. గత ఫెడ్ సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. ఫలితంగా వడ్డీ రేట్ల పెంపు తీవ్రత కొనసాగుతుందని మార్కెట్లో భయాలు నెలకొనడంతో మదుపర్లు అమ్మకాలపై దృష్టిపెట్టారు.
స్టాక్ మార్కెట్ నిపుణులు ప్రకారం.. నిఫ్టీ డైలీ ఛార్ట్‌లో నెగిటివ్ క్యాండిల్ ఏర్పడింది. ఒడుదొడుకులతో కూడిన డౌన్‌సైడ్ ట్రెండ్.. నిఫ్టీలో కొనసాగుతోంది.
Stock market news today : "లోయర్ టాప్స్- బాటమ్తో కూడిన నెగిటివ్ ఛార్ట్ పాటర్న్ నిఫ్టీలో ఏర్పడింది. షార్ట్ టర్మ్‌లో నిఫ్టీ 17,775 లెవల్స్‌ను తాకే అవకాశం ఉంది. 18,1000 లెవల్ రెసిస్టెన్స్‌గా ఉంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు.
ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి కారణంగానే స్టాక్ మార్కెట్లు పడుతున్నట్టు.. 5పైసా.కామ్ లీడ్ రీసెర్చ్ రుచిత్ జైన్ వెల్లడించారు. 'లాంగ్- షార్ట్ రేషియో' 36శాతనికి పడిపోయిందని వివరించారు. క్యాష్ సెగ్మెంట్లో విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 'బై ఆన్ డిప్స్' స్ట్రాటజీని అనుసరించవచ్చని స్పష్టం చేశారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ను అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగించాయి. డౌ జోన్స్ 1.02శాతం పతనమైది. ఎస్ అండ్ పీ 500 1.16శాతం, నాస్డాక్ 1.47శాతం నష్టాల్లో ముగిశాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1449.45కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు కూడా 194.09కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
స్టాక్స్ టు బై:-
- ITC share price target : ఐటీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 326, టార్గెట్ రూ. 340- రూ. 350
- లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్టీ):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2050, టార్గెట్ రూ. 2125- రూ. 2150
- Stocks to buy విప్రో:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 365, టార్గెట్ రూ. 410
- టాటా స్టీల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 109, టార్గెట్ రూ. 125
- పాలీక్యాబ్:- బై రూ. 2650, స్టాప్ లాస్ రూ. 2580, టార్గెట్ రూ. 2740
- మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎస్ఎల్):- బై రూ. 735, స్టాప్ లాస్ రూ. 715, టార్గెట్ రూ. 770
(గమనిక:- ఇవి నిపుణులు సూచనలు మాత్రమే. ఇది సమాచారం కోసం ప్రచురించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)