తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Prime: ఆమెజాన్ ప్రైమ్ నుంచి కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్.. సంవత్సరానికి రూ. 399 లే..

Amazon Prime: ఆమెజాన్ ప్రైమ్ నుంచి కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్.. సంవత్సరానికి రూ. 399 లే..

HT Telugu Desk HT Telugu

06 October 2023, 17:19 IST

  • Amazon Prime Shopping Edition: అక్టోబర్ 8వ తేదీ నుంచి ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) సేల్ ప్రారంభం అవుతోంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఆమెజాన్ రూ. 399 లతో కొత్త ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ (Prime Shopping Edition) ను లాంచ్ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amazon Prime Shopping Edition: ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్ లో కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ఆమెజాన్ (Amazon) ప్రారంభించింది. రూ. 399 లతో ఈ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఇది సంవత్సరం వ్యాలిడిటీతో ఉంటుంది. కానీ, కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం..

ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఆమెజాన్ కొత్త ప్రైమ్ మెంబర్ షిప్ ప్రొగ్రామ్ ను లాంచ్ చేసింది. దీనికి ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ గా పేరు పెట్టింది. మరో రెండు రోజుల్లో ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) సేల్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మరింత ఎక్కువ మంది వినియోగదారులను ఈ సేల్ కు ఆకర్షించే లక్ష్యంతో ఈ ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం.. ఆండ్రాయిడ్ యూజర్లు రూ. 399 చెల్లించి సంవత్సరం వ్యాలిడిటీతో ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. ఒక అంచనా ప్రకారం.. భారత్ లో 65 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్నారు. వారిలో దాదాపు 90% మంది ఆండ్రాయిడ్ యూజర్లే. అందువల్ల వారిని లక్ష్యంగా పెట్టుకుని ఆమెజాన్ ఈ ప్లాన్ ను తీసుకువచ్చింది.

ఇవే ప్రత్యేకతలు..

ఈ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ సబ్ స్క్రిప్షన్ ప్రత్యేకతలు ఇవే..

  • ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే.
  • ఈ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి ఆమెజాన్ కొనుగోళ్లపై ఫ్రీ డెలివరీ, ఫ్రీ వన్ డే డెలివరీ సహా పలు షాపింగ్ సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి.
  • ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, రీడింగ్, గేమింగ్.. వంటి ఎంటర్టైన్ మెంట్ ప్రయోజనాలు వీరికి ఉండవు.
  • ఆండ్రాయిడ్ డివైజ్ ల్లోని ఆమెజాన్ యాప్, ఆమెజాన్ వెబ్ బ్రౌజర్లపై ఈ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ను ఉపయోగించవచ్చు.
  • ఈ ప్లాన్ ఎప్పటివరకు ఉంటుందన్న విషయాన్ని ఆమెజాన్ వెల్లడించలేదు.
  • ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలనుకునే వారు, ముఖ్యంగా ఇప్పటికే ప్రైమ్ మెంబర్ షిప్ లేనివారికి ఇది ఉపయుక్తం.
  • ఇప్పటికే ఆమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.

తదుపరి వ్యాసం