తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Adani Ports Q4 Results: షేర్ హోల్డర్లకు 1000 కోట్ల రూపాయల డివిడెండ్ ఇస్తున్న ఆదానీ కంపెనీ

Adani Ports Q4 results: షేర్ హోల్డర్లకు 1000 కోట్ల రూపాయల డివిడెండ్ ఇస్తున్న ఆదానీ కంపెనీ

HT Telugu Desk HT Telugu

30 May 2023, 20:58 IST

  • Adani Ports Q4 results: ఆదానీ పోర్ట్స్ Q4 ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. 2022 -23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆదానీ పోర్ట్స్ రూ. 1,158.88 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. మొత్తంగా 2022 -23 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,310.18 కోట్ల నికర లాభాలను ఆదానీ పోర్ట్స్ సముపార్జించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

ప్రతీకాత్మక చిత్రం

Q4FY23 లో ఆదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ నికర లాభాలు Q4FY22 కన్నా 5.1% అధికం. Q4FY22 లో ఆదానీ పోర్ట్స్ నికర లాభాలు రూ. 1,102.61 కోట్లు. అలాగే, FY23 లో సంస్థ మొత్తం నికర లాభాలు రూ. 5,310.18 కోట్లు కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (FY22) లో ఆదానీ పోర్ట్స్ రూ. 4,886.03 కోట్ల లాభాలను సాధించింది. ఈ Q4FY23 లో ఆదానీ పోర్ట్స్ ఆదాయం రూ. 5,797 కోట్లు. ఇది Q4FY22 కన్నా 40% అధికం. Q4FY22లో సంస్థ ఆదాయం రూ. 4,140.8 కోట్లు.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

Adani Ports dividend: 250% డివిడెండ్

FY23 లో ఆదానీ పోర్ట్స్ ఆదాయం రూ. 20,851.91 కోట్లుగా ఉంది. ఇది FY22 లో రూ. 17,118.79 కోట్లు. Q4FY23 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు డివిడెండ్ ను కూడా ఆదానీ పోర్ట్స్ యాజమాన్యం ప్రకటించింది. రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 5 (250%) డివిడెండ్ గా అందించాలని నిర్ణయించింది. అంటే, షేర్ హోల్డర్లకు సంస్థ చెల్లిస్తున్న ఈ డివిడెండ్ విలువ సుమారు రూ. 1,080 కోట్లుగా ఉండనుంది. బీఎస్ఈ లో ఆదానీ పోర్ట్స్ షేర్ విలువ మంగళవారం 0.43% తగ్గి రూ. 734.30 వద్ద ముగిసింది. ఆదానీ గ్రూప్ కంపెనీల్లో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ తరువాత ఆదానీ పోర్ట్స్ అత్యంత విలువైన కంపెనీ. మే 30 నాటికి ఆదానీ పోర్ట్స్ మార్కెట్ క్యాప్ రూ. 1.58 లక్షల కోట్లు.

తదుపరి వ్యాసం