తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Aadhaar Update : ఆధార్​ కార్డు వివరాలను వాట్సాప్​లో షేర్​ చేస్తున్నారా? తస్మాత్​ జాగ్రత్త!

Aadhaar update : ఆధార్​ కార్డు వివరాలను వాట్సాప్​లో షేర్​ చేస్తున్నారా? తస్మాత్​ జాగ్రత్త!

Sharath Chitturi HT Telugu

20 August 2023, 13:34 IST

  • Aadhaar update : మీ ఆధార్​ కార్డు వివరాలను వాట్సాప్​ లేదా ఈ-మెయిల్స్​లో షేర్​ చేస్తున్నారా? అయితే తస్మాత్​ జాగ్రత్త. అసలు విషయం ఏంటంటే..

ఆధార్​ కార్డు వివరాలను వాట్సాప్​లో షేర్​ చేస్తున్నారా? తస్మాత్​ జాగ్రత్త!
ఆధార్​ కార్డు వివరాలను వాట్సాప్​లో షేర్​ చేస్తున్నారా? తస్మాత్​ జాగ్రత్త! (Mint)

ఆధార్​ కార్డు వివరాలను వాట్సాప్​లో షేర్​ చేస్తున్నారా? తస్మాత్​ జాగ్రత్త!

Aadhaar update scam : "మీ ఆధార్​ కార్డును అప్డేట్​ చేయాలి. వివరాలు పంపండి," అని మీకు వాట్సాప్​, ఈ-మెయిల్​లో మెసేజ్​లు వస్తున్నాయా? అవి నమ్మి మీరు పత్రాలను షేర్​ చేస్తున్నారా? అయితే తస్మాత్​ జాగ్రత్త! ఇది మరో రకమైన స్కామ్​ అని యూఐడీఏఐ (యునీక్​ ఐడెన్టిఫికేషన్​ అథారిటీ ఆఫ్​ ఇండియా) హెచ్చరించింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆధార్​ కార్డును అప్డేట్​ చేసేందుకు, ప్రజలకు తాము ఎలాంటి మెసేజ్​లు పంపించమని స్పష్టం చేసింది.

వాట్సాప్​, మెయిల్​లో ఆధార్​ కార్డు వివరాలను పెట్టకూడదని, ప్రజలే సొంతంగా ఆన్​లైన్​ లేదా ఆధార్​ సెంటర్స్​లో అప్డేట్​ చేసుకోవాలని యూఐడీఏఐ వెల్లడించింది.

"మీ ఆధార్​ కార్డు డాక్యుమెంట్స్​ను వాట్సాప్​, మెయిల్స్​ ద్వారా పంపించాలని యూఐడీఏఐ ఎప్పుడు అడగదు. మైఆధార్​ పోర్టల్​ లేదా ఆధార్​ సెంటర్లలోనే అప్డేట్​ చేసుకోవాలి," అని ఎక్స్​ (ట్విట్టర్​)లో ట్వీట్​ చేసింది.

ప్రజలు తమ ఆధార్​ కార్డులోని వివరాలను అప్డేట్​ చేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా.. 10ఏళ్లు, అంతకన్నా ముందు ఆధార్​ కార్డు తీసుకున్న వారి వివరాలు మార్చుకునేందుకు వెసులుబాటును కల్పించింది. ఫలితంగా ఈజ్​ ఆఫ్​ లివింగ్​, సర్వీస్​ డెలివరీ వంటివి మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, కొందరు సైబర్​ మోసగాళ్లు.. యూఐడీఏఐ నుంచి అంటూ మెయిల్స్​, వాట్సాప్​ ద్వారా మెసేజ్​ చేసి, ప్రజల వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే యూఐడీఏఐ ఈ హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు ఆధార్​ కార్డును ఫ్రీగా అప్డేట్​ చేసుకునేందుకు ఉన్న గడువును 2023 జూన్​ 14 నుంచి 2023 సెప్టెంబర్​ 14కు పొడిగించింది యూఐడీఏఐ.

ఎలా అప్డేట్​ చేసుకోవాలి?

How to update Aadhar card online : స్టెప్​ 1:- ముందుగా https://myaadhaar.uidai.gov.in/ లోకి వెళ్లి మీ ఆధార్​ నెంబర్​తో లాగిన్​ అవ్వండి.

స్టెప్​ 2:- 'ప్రొసీడ్​ అండ్​ అప్డేట్​ అడ్రెస్​' ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్​ చేయండి.

స్టెప్​ 4:- 'డాక్యుమెంట్​ అప్డేట్​' ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి. వివరాలు కనిపిస్తాయి.

స్టెప్​ 5:- వివరాలను వెరిఫై చేసి ఓకే చేయాలి. ఆ పక్కనే కనిపించే హైపర్​లింక్​ మీద క్లిక్​ చేయాలి.

Aadhaar card update online : స్టెప్​ 6:- ఇప్పుడు ఐడెంటిటీ ప్రూఫ్​, అడ్రెస్​ ప్రూప్​ వంటి పత్రాలను డ్రాప్​డౌన్​ లిస్ట్​ నుంచి ఎంచుకోవాలి.

స్టెప్​ 7:- సబ్మీట్​ బటన్​ మీద క్లిక్​ చేయాలి. పత్రాలను సమర్పించాలి.

స్టెప్​ 8:- మీ రిక్వెస్ట్​ జనరేట్​ అవుతుంది. 14 డిజిట్​ యూఆర్​ఎన్​ (అప్డేట్​ రిక్వెస్ట్​ నెంబర్​) వస్తుంది. దానితో మీ అప్టేడ్​ రిక్వెస్ట్​ స్టేటస్​ను తెలుసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం