తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Kia Sonet: 2024 మోడల్ కియా సొనెట్ కార్లు ఎంత మైలేజ్ ఇస్తాయో తెలుసా..?

2024 Kia Sonet: 2024 మోడల్ కియా సొనెట్ కార్లు ఎంత మైలేజ్ ఇస్తాయో తెలుసా..?

HT Telugu Desk HT Telugu

06 January 2024, 16:52 IST

  • 2024 Kia Sonet: 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కార్ మూడు ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది. ఈ కార్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఎస్ యూ వీ
2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఎస్ యూ వీ

2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఎస్ యూ వీ

2024 Kia Sonet: 2024 సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ వర్షన్ కాంపాక్ట్ ఎస్ యూవీ వర్షన్ ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి కియా ఇండియా సిద్ధంగా ఉంది. ఈ మోడల్ ను గత నెలలో ఆవిష్కరించారు. అలాగే, ఈ 2024 కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కార్ల బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి

రూ. 25 వేలు..

2024 కియా సోనెట్ (2024 Kia Sonet) ఫేస్ లిఫ్ట్ మోడల్ కాంపాక్ట్ ఎస్ యూ వీ కారును కొనుగోలు చేయాలనుకునేవారు కియా డీలర్స్ వద్ద రూ. 25 వేల టోకెన్ అమౌంట్ కట్టి బుక్ చేసుకోవచ్చు. 2024 కియా సోనెట్ మూడు ఇంజన్ ఎంపికలతో వస్తోంది. అవి, 1.2-లీటర్ నాచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. అన్ని ఇంజన్లు స్టాండర్డ్‌గా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.

మైలేజీ వివరాలు..

నాచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది లీటర్ పెట్రోలుకు 18.83 కిమీల మైలేజీ ఇస్తుందని కియా చెబుతోంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ గేర్‌బాక్స్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోంది. ఇవి వరుసగా 18.7 kmpl, 19.2 kmpl మైలేజీ ఇస్తాయని కంపెనీ చెబుతోంది.

డీజిల్ ఇంజిన్ తో 22 కిమీల మైలేజీ..

6-స్పీడ్ ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే డీజిల్ ఇంజన్ 22.3 kmpl ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుందని, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్ 18.6 kmpl ఇంధన సామర్థ్యం కలిగి ఉందని కియా చెబుతోంది. చివరగా, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న మోడల్ మైలేజీ వివరాలు ఇంకా తెలియరాలేదు.

Features: 2024 కియా సోనెట్ ఫీచర్స్

అధునాతన డ్రైవర్ ఎయిడ్స్ సిస్టమ్ లేదా ADAS ఈ 2024 ఫేస్ లిఫ్ట్ సోనెట్‌కు అతిపెద్ద ఆకర్షణ. ఈ కాంపాక్ట్ SUV రీడిజైన్ చేయబడిన ఎక్స్టీరియర్‌తో, మరింత డైనమిక్ గా కనిపిస్తుంది. ఇంటీరియర్ లో పెద్దగా మార్పులేవీ చేయలేదు. ఇందులో అదనంగా వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రిక్ సీట్లు, వెనుక కర్టెన్‌లు తదితర ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ 2024 కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ మార్కెట్లో టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300 వంటి వాటితో పోటీ పడనుంది.

తదుపరి వ్యాసం