తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mp Vijayasai Reddy : అమ్మా పురందేశ్వరిగారు... Bjp అంటే “బాబు జనతా పార్టీ” కాదు

MP Vijayasai Reddy : అమ్మా పురందేశ్వరిగారు... BJP అంటే “బాబు జనతా పార్టీ” కాదు

30 July 2023, 9:13 IST

    • YSRCP vs AP BJP: బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని  మరోసారి టార్గెట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదంటూ సెటైర్లు విసిరారు. 
పురందేశ్వరి టార్గెట్ గా విజయసాయి ట్వీట్లు
పురందేశ్వరి టార్గెట్ గా విజయసాయి ట్వీట్లు

పురందేశ్వరి టార్గెట్ గా విజయసాయి ట్వీట్లు

YSRCP vs AP BJP: ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే ఆంధ్రా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని భావిస్తుండగా... మరోవైపు జనసేన - బీజేపీ కలిసి పోటీ చేస్తామని చెబుతున్నాయి కాషాయవర్గాలు. మరోవైపు సోమును తప్పించిన బీజేపీ హైకమాండ్... పురందేశ్వరికి కొత్తగా బాధ్యతలు అప్పగించంది. రాష్ట్రంలో కలియ తిరుగుతున్న ఆమె... వైసీపీ సర్కార్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తీవ్రమైన అవినీతితో పాలన సాగిస్తున్నాంటూ విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. కట్ చేస్తే... పురందేశ్వరిని ఉద్దేశిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి పని చేయడం ఏంటి అంటూ ప్రశ్నించిన ఆయన… తాజాగా మరో ట్వీట్ వదిలారు.

ట్రెండింగ్ వార్తలు

Akhila Priya Bodyguard Attacked : అఖిల ప్రియ బాడీగార్డ్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-ఐదుగురిపై కేసు నమోదు

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

అమ్మా, పురందేశ్వరిగారు...బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి."బాబుది స్క్రిప్ట్‌... వదినది డైలాగ్‌! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ...మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్" అంటూ దుయ్యబట్టారు. "మీ నాన్నగారు మహానటులు... మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే!" అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు విసిరారు.

శనివారం కూడా విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు...వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! అంటూ పురందేశ్వరని ఉద్దేశిస్తూ హితవు పలికారు. అలా చేస్తే ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుందంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు? అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. తన ట్వీట్ కు ఓ ఫొటోను కూడా జత చేశారు.

అయితే గత కొంతకాలంగా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయటం తగ్గించిన విజయసాయిరెడ్డి… ఈ మధ్య మళ్లీ షురూ చేసేశారు. సమయం, సందర్భానికి అనుగుణంగా… ప్రతిపక్ష తెలుగుదేశంపై విమ్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. బీజేపీ కొత్త అధ్యక్షురాలిగా నియమితులైన పురందేశ్వరికి సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ… సెటెర్లు విసురుతున్నారు. అయితే వీటికి పురందేశ్వరి ఎలా బదులిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తదుపరి వ్యాసం