తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Vaikunta Darshanam Tickets: సర్వదర్శనం టోకెన్ల జారీ… తిరుపతిలో భారీగా రద్దీ

Tirumala Vaikunta Darshanam Tickets: సర్వదర్శనం టోకెన్ల జారీ… తిరుపతిలో భారీగా రద్దీ

HT Telugu Desk HT Telugu

01 January 2023, 13:03 IST

    • Vaikunta Darshanam Tickets at Tirumala: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతిలో టోకెన్ల జారీ ప్రారంభమైంది. భక్తులు భారీగా తరలిరావటంతో రద్దీ నెలకొంది. 
టోకెన్ల జారీ
టోకెన్ల జారీ (facebook)

టోకెన్ల జారీ

Vaikunta Darsanam in Tirumala 2023:తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతిలో టోకెన్ల జారీ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే టికెట్ల జారీ ప్రక్రియ షురూ అయింది. నిజానికి ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకెన్ల జారీని ప్రారంభిస్తామని తొలుత టీటీడీ అధికారులు ప్రకటించినప్పటికీ.... భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వేకువజామున 3 గంటల నుంచే స్టార్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Updates: పగలు మండే ఎండలు, సాయంత్రానికి భారీ వర్షాలు, ఏపీకి ఐఎండి తీపి కబురు

AP Weather Alert : ఏపీ పోలింగ్ రోజున భిన్నమైన వాతావరణం, ఈ జిల్లాల్లో వర్షాలు!

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే

జనవరి 2 (వైకుంఠ ఏకాదశి) నుంచి జనవరి 11 వరకు భక్తులు దర్శించుకునేందుకు నగరంలోని 9 కేంద్రాల ద్వారా స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు.రోజుకు 45 వేల చొప్పున పది రోజులకు ఒకేసారి 4.5 లక్షల ఎస్‌ఎస్‌డీ టోకెన్లను ఇచ్చేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. పది రోజుల టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్లు జారీ చేయనున్నారు.

సెంటర్లు ఇవే…

తిరుపతిలో అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్‌... రైల్వేస్టేషన్‌ ఎదురుగా గల విష్ణునివాసం... రైల్వేస్టేషన్‌ వెనుక గల 2,3 సత్రాలు... ఆర్‌టిసి బస్టాండు ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్‌.... ఇందిరా మైదానం... జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌.... భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌... ఎంఆర్‌ పల్లి జడ్‌పి హైస్కూల్‌.... రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లు అందజేస్తున్నారు. తిరుపతిలో టోకెన్లు పొందాకే భక్తులు తిరుమలకు రావాలని.. టోకెన్లు కలిగిన భక్తులను దర్శన సమయానికి అర్ధగంట ముందు మాత్రమే క్యూ లైన్ లోకి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది.

కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధిలో కొత్త ఏడాది జనవరిలో పలు వేడుకలు జరగనున్నాయి. విశేష పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు.. తేదీల వారీగా జరగనున్న వేడుకల వివరాలను టీటీడీ వెల్లడించింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ పేర్కొంది. జనవరి 2వ తేదీన తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తామని వెల్లడించింది. జనవరి 3న శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి, శ్రీవారి చక్రస్నానం.... జనవరి 7న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం.... అదే రోజు నుంచి 13 వ తేదీ వరకు ఆండాళ్ నీరాటోత్సవం... జనవరి 14న భోగీ పండుగ.... జనవరి 15న తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం, మకర సంక్రాంతి.... జనవరి 16న కనుమ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేం చేస్తారు. తిరుమలనంబి సన్నిధికి వేం చేపు... శ్రీ గోదా పరిణయోత్సవం జరుగుతాయి. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం మరియు వసంత పంచమి వేడుకలు... జనవరి 28న రథసప్తమి నిర్వహిస్తారు.

తదుపరి వ్యాసం