తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bjp Ap: ఏపీకి బీజేపీ అగ్రనేతల రాక.. 8న అమిత్ షా, 10న నడ్డా టూర్

BJP AP: ఏపీకి బీజేపీ అగ్రనేతల రాక.. 8న అమిత్ షా, 10న నడ్డా టూర్

02 June 2023, 16:22 IST

    • Amith Sha Andhrapradesh Tour: బీజేపీ అగ్రనేతలు ఏపీృ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు అమిత్ షా, జేపీ నడ్డా షెడ్యూల్ ఖరారైంది. 
హోంశాఖ మంత్రి అమిత్ షా(ఫైల్ ఫొటో)
హోంశాఖ మంత్రి అమిత్ షా(ఫైల్ ఫొటో)

హోంశాఖ మంత్రి అమిత్ షా(ఫైల్ ఫొటో)

BJP Andhrapradesh:ఈ నెలలో బీజేపీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 8వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, 10వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్ ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 9 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను తలపెట్టింది. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీ విశాఖపట్నంలో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Akhila Priya Bodyguard Attacked : అఖిల ప్రియ బాడీగార్డ్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-ఐదుగురిపై కేసు నమోదు

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఏపీకి రానున్నారు. ఈనెల 10వ తేదీన తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు కార్యక్రమం వివరాలు తెలియజేశారు. మరోవైపు అగ్రనేతలు ఇద్దరు ఏపీకి రానున్న నేపథ్యంలో.. ఏర్పాట్లపై దృష్టి పెట్టింది స్థానిక నాయకత్వం.

వైసీపీపై జీవీఎల్ ఫైర్….

ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుంటే...ఎందుకు ఇస్తున్నారని కొందరు అడుగుతున్నారని అన్నారు ఎంపీ జీవీఎల్. ఏపీలో ఎలాంటి రాజకీయ లబ్ధి ఆశించకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్ట్యా రెవెన్యూ లోటు భర్తీ కి ఆంధ్రప్రదేశ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిధులు మంజూరు చేశారని చెప్పారు. నరేంద్ర మోడీ కి ప్రత్యేక చొరవతో నే ఏపికి నిధులు వస్తున్నాయని, రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తున్న విషయాన్ని ప్రభుత్వం ఎక్కడా చెప్పడం లేదన్నారు.

ఇటీవల ఏపీకి కేంద్రం రూ.10,461 కోట్లు రూపాయలు రెవెన్యూ గ్రాంట్ గా ఏపికి కేటాయించిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారని, ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో చూడలేదన్నారు. నరేంద్ర మోడీ రాజకీయ లబ్ది కోసం పని చెయ్యరు..ప్రజల కోసం పనిచేస్తారని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడు గా ఖర్చు చేస్తున్నారని, ఎక్కడా కేంద్రం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుందని విమర్శించారు. రాష్ట్రం అప్పులు ఊబి లో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తుందన్నారు.

పోలవరం ప్రాజెక్టు పై ప్రధానికి చాలా సానుకూలంగా ఉన్నారని, పోలవరం ప్రాజెక్ట్ కి అదనంగా 12 వేల 911 కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేవారు. పోలవరం 41.15 మీటర్ల వరకు తొలి దశ నిర్మాణం కోసం నిధులు కేంద్ర ప్రభుత్యం ఇస్తుందని జివిఎల్ స్పష్టం చేశారు. కేంద్ర పధకాలకు జగన్ స్టిక్కర్లను వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో‌ వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఛార్జిషీటు ద్వారా ప్రజలకు వివరిస్తామని జివిఎల్ చెప్పారు. త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని, దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను సమకూరుతాయని చెప్పారు.తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మత్తుల నిమిత్తం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇస్తోందని చెప్పారు.దీనిపై త్వరలో కేంద్ర కెబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారని, పోలవరంలో పూర్తి స్థాయి నీటి నిల్వ చేసుకునేలా అవసరమైన నిధులు, అనుమతులు, అంతరాష్ట్ర వివాదాలను కేంద్రం పరిష్కరిస్తుందన్నారు.

ఏపీకి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని, తొమ్మిదేళ్ల కాలంలో రూ. 55 వేల కోట్ల మేర నరేగా నిధులిచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చే ప్రధాన పథకాల్లో ఏపీకి చేకూరినంత లబ్ది మరెనరికీ చేకూర్చలేదన్నారు. ఏపీకి ప్రధాని మోడీ సరికొత్త వరాలు ప్రకటించాలన్నారు. రెవెన్యూ డెఫిసిట్ రూ. 10 వేల కోట్లు ఇచ్చారని, స్పెషల్ ఇన్సెంటీవ్స్ ప్యాకేజీ రూపంలో రూ. 10 వేల కోట్లకు పైగా నిధులిచ్చారని గుర్తు చేశారు.రూ.10 వేల కోట్లు ఏపీ ప్రజలకు వరమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను గుట్టుగా తెచ్చుకుని తామేదో ప్రజలకు సేవ చేసినట్టు వైసీపీ చెప్పుకుంటోందని, నిధులివ్వకుంటే వైసీపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. 2016 నుంచి ఇప్పటి వరకు రూ. 16,984 కోట్లు అదనపు రుణం గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చుకున్నాయని, దీంతో కేంద్రం అప్పులపై పరిమితి విధించిందని చెప్పారు. ఈ ఏడాది కూడా రూ. 8 వేల కోట్లు కోత విధించాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మీదట మూడేళ్లల్లో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించిందన్నారు. ఈ ఏడాది రూ. 2667 కోట్ల మాత్రమే కోత విధించి.. సుమారు రూ. 5 వేల కోట్ల మేర రుణ వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు.

తదుపరి వ్యాసం