Live News Today: మణిపూర్ ఘర్షణలపై దర్యాప్తునకు కమిటీ.. వారికి అమిత్ షా వార్నింగ్-live news latest updates today june 01 breaking news rahul gandhi in us amit shah manipur tour ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Live News Latest Updates Today June 01 Breaking News Rahul Gandhi In Us Amit Shah Manipur Tour

లేటెస్ట్ న్యూస్(PTI)

Live News Today: మణిపూర్ ఘర్షణలపై దర్యాప్తునకు కమిటీ.. వారికి అమిత్ షా వార్నింగ్

Live News - Latest Updates Today:  నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, ఆటో, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ తెలుసుకోండి. లేటెస్ట్ అప్‍డేట్ల కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవుతూనే ఉండండి. . 

Thu, 01 Jun 202312:36 PM IST

స్టాలిన్‍తో కేజ్రీవాల్ భేటీ

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‍తో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఢిల్లీ ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో డీఎంకే వ్యతిరేకించాలని స్టాలిన్‍ను కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ వెంట చెన్నైకి పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా వచ్చారు. 

Thu, 01 Jun 202312:06 PM IST

32కేజీల బంగారం పట్టివేత

సముద్రం గుండా గుల్ఫ్ నుంచి రెండు ఫిషింగ్ బోట్లలో అక్రమంగా రవాణా చేస్తున్న 32.68 కేజీల బంగారాన్ని తమిళనాడులోని మన్నార్‌లో భారత కోస్టుగార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ.20.2 కోట్లుగా ఉంటుంది. 

Thu, 01 Jun 202311:29 AM IST

కేజ్రీవాల్‍కు స్వాగతం పలికిన తమిళనాడు మంత్రులు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. తమిళనాడుకు చేరుకున్నారు. మంత్రులు ఆయనకు చెన్నై ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఢిల్లీ ఆర్డినెన్సును పార్లమెంటులో వ్యతిరేకించాలని తమిళనాడు సీఎం స్టాలిన్‍ను కేజ్రీవాల్ కోరనున్నారు. ఈ మేరకు ఆయనతో భేటీ కానున్నారు. కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా ఉన్నారు. 

Thu, 01 Jun 202310:50 AM IST

ప్రతిపక్షాల సమావేశానికి హాజరుకానున్న కాంగ్రెస్

12వ తేదీన పట్నాలో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కూడా హజరువుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. అయితే, పార్టీ తరఫున ఎవరు సమావేశానికి వెళ్లాలన్నది ఇంకా నిర్ణయించలేదని అన్నారు. 

Thu, 01 Jun 202310:35 AM IST

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.65 పాయింట్లు కోల్పోయి 18,487.75 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 193.70 పాయింట్లు నష్టపోయి 62,428.54 వద్ద స్థిరపడింది.  

Thu, 01 Jun 202310:01 AM IST

ఎన్‍సీఆర్‌టీ పుస్తకాల నుంచి పీరియాడిక్ టేబుల్, డెమొక్రసీ తొలగింపు

10వ తరగతి పుస్తకాల నుంచి పీరియాడిక్ టేబుల్, డెమొక్రసీ, ఎనర్జీ సోర్సెస్ పాఠ్యాంశాలను ఎన్‍సీఆర్‌టీ తొలగించినట్టు తెలుస్తోంది. 

Thu, 01 Jun 202309:19 AM IST

మారుతీ సుజుకీ అమ్మకాల్లో 10 శాతం వృద్ధి

ఈ ఏడాది మే నెలలో కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ 1,78,083 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే సుమారు 10 శాతం వృద్ధి సాధించింది. ముఖ్యంగా ఎస్‍యూవీ కార్ల అమ్మకాల్లో సుమారు 64 శాతం వృద్ధి కనబరిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Thu, 01 Jun 202309:01 AM IST

రష్యా మంత్రితో జైశంకర్ భేటీ

రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‍తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. దక్షిణాఫ్రికాలోని కేప్‍టౌన్‍లో జరుగుతున్న బ్రిక్స్ మినిస్టేరియల్ సదస్సు సందర్భంగా వీరు సమావేశమయ్యారు. 

Thu, 01 Jun 202308:28 AM IST

కుప్పకూలిన వాయుసేన విమానం

భారత ఎయిర్‌ఫోర్స్ కు చెందిన కిరణ్ ట్రైనర్ విమానం కర్ణాటకలోని చామ్‍రాజ్‍నగర్ సమీపంలో కూలిపోయింది. విమానంలో ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటికి వచ్చారు. 

Thu, 01 Jun 202307:58 AM IST

ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల.. 8వేలపైగా పోస్టులు

IBPS RRB Notification 2023: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదలైంది. ఐబీపీఎస్ ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టులను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఈ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. నేడు ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 21వ తేదీ వరకు అప్లే చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Thu, 01 Jun 202307:33 AM IST

మణిపూర్‌కు కొత్త డీజీపీ 

ఘర్షణలతో అట్టుడికి పోతున్న మణిపూర్‌లో డీజీపీని మార్చింది ప్రభుత్వం. కొత్త డీజీపీగా రాజీవ్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీ పీ.దౌంగెల్‍.. హోం శాఖకు బదిలీ అయ్యారు. 

Thu, 01 Jun 202306:58 AM IST

మోదీతో నేపాల్ ప్రధాని భేటీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేపాల్ ప్రధాని పుష్ప దహల్ ప్రచండ భేటీ అయ్యారు. నేడు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‍లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

Thu, 01 Jun 202306:43 AM IST

మణిపూర్ ఘర్షణలపై దర్యాప్తునకు కమిటీ.. వారికి అమిత్ షా వార్నింగ్

మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఘర్షణలపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భద్రతా దళాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లిన వారు తక్షణమే వాటిని అధికారులకు తిరిగి ఇచ్చేయాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరు ఘర్షణల కేసులపై సీబీఐ విచారణ జరుపుతుందని చెప్పారు.  ప్రస్తుతం మణిపూర్‌లో పర్యటిస్తున్నారు అమిత్ షా. నేడు ఇంఫాల్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లోని చాలా జిల్లాల్లో కుకీలు, మైటీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మణిపూర్ ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 90 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. 

Thu, 01 Jun 202306:38 AM IST

ఫ్లాట్‍గా కొనసాగుతున్న మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‍గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈ నిఫ్టీ 4.05 పాయింట్లు పెరిగి 18,538.45 వద్ద, సెన్సెక్స్ 13.22 పాయింట్ల నష్టంతో 62,609.02 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

Thu, 01 Jun 202306:34 AM IST

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల పెరుగుదల

ఓలా ఎస్1, ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఫేమ్-2 సబ్సిడీ తగ్గించటంతో ఓలా ఈ నిర్ణయం తీసుకుంది. స్కూటర్‌పై రూ.15వేల వరకు ధర పెంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Thu, 01 Jun 202306:33 AM IST

ఎలాన్ మస్క్ మళ్లీ నంబర్ 1

ప్రపంచ అత్యధిక ధనికుల జాబితాలో ట్విట్టర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మళ్లీ అగ్రస్థానానికి వచ్చారు. ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 192.3 బిలియన్ డాలర్లుగా ఉంది. బెర్నార్డ్ అర్నాల్ట్ (186.6 బిలియన్ డాలర్లు)ను దాటి మరోసారి టాప్‍కు వెళ్లారు మస్క్.  

Thu, 01 Jun 202306:38 AM IST

తగ్గిన ఎల్‍పీజీ ధరలు

దేశంలో కమర్షియల్ ఎల్‍పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. కమర్షియల్ ఎల్‍పీజీ సిలిండర్‌పై రూ.83.50 ధర తగ్గింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.