తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Viveka Case : వివేకా కేసులో మరో మలుపు.. సాక్షిగా Ys షర్మిల పేరు, వెలుగులోకి కీలక విషయాలు!

YS Viveka Case : వివేకా కేసులో మరో మలుపు.. సాక్షిగా YS షర్మిల పేరు, వెలుగులోకి కీలక విషయాలు!

21 July 2023, 17:19 IST

    • YS Viveka Case Updates: వైఎస్ వివేకా కేసులో కీలక అంశం వెలుగు చూసింది. ఈ కేసులో వైఎస్‌ షర్మిలను సాక్షిగా చేర్చింది సీబీఐ. కేసు దర్యాప్తులో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి గత నెల 30న కోర్టుకు సమర్పించింది. ఇందులో పలు అంశాలను ప్రస్తావించింది. 
వైఎస్ వివేకా హత్య కేసు
వైఎస్ వివేకా హత్య కేసు

వైఎస్ వివేకా హత్య కేసు

YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు నుంచి విచారిస్తున్న సీబీఐ.... వైఎస్ షర్మిలను కూడా సాక్షిగా ప్రస్తావించింది. 259వ సాక్షిగా పేర్కొంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ... కోర్టుకు వాంగ్మూలాన్ని సమర్పించింది. దర్యాప్తులో భాగంగా భాగంగా ఇప్పటివరకు విచారించిన వారి వాంగ్మూలాలు నమోదు చేసి గత నెల 30న కోర్టుకు సమర్పించింది. ఇందులో కీలక విషయాలు ఉన్నాయి. హత్య జరగటం, బయటి రావటంతో పాటు.. ఎవరికి ఎవరు సమాచారం ఇచ్చారు వంటి అంశాలను పేర్కొనంటంతో పాటు...సాక్షుల పేర్లను తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

AP Inter Supply Hall Tickets : మే 24 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఇవాళే హాల్ టికెట్లు!

AP Aarogya Sri : ఏపీలో మే 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్, స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రకటన

Mangalagiri SI: పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు తీసుకున్న మంగళగిరి ఎస్సై సస్పెన్షన్, రాజకీయ కుట్రగా ఆరోపిస్తోన్న ఎస్సై

AP Bureaucrats: ఏపీలో అంతే.. ఫేస్‌బుక్‌లో హీరోలు,విధుల్లో జీరోలు,పేలవమైన పనితీరు

ప్రస్తుతం సీఎం జగన్‌ ఓఎస్‌డీగా ఉన్న పి.కృష్ణమోహన్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో పాటు విశ్రాంత సీఎస్‌ అజేయ కల్లం, జగన్ అటెండర్ నవీన్, పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పిన విషయాలను రికార్డు చేసింది సీబీఐ. వివేకా హత్య విషయం జగన్ ఎలా చేరిందనే విషయాలను ఇందులో ప్రస్తావించారు. జగన్ తో పాటు ఓ సమావేశంలో ఉండగా అటెండర్ వచ్చి తనని బయటి రమ్మని చెప్పారని.. నేను బయటికి వెళ్లగా ఎంపీ అవినాష్ రెడ్డి లైన్ లో ఉన్నారని కృష్ణమోహన్ రెడ్డి తన వాంగ్మూలంలో తెలిపారని సీబీఐ చెప్పుకొచ్చింది.

ఇక వైఎస్ఆర్టీసీ అధినేత్రి షర్మిల గత ఏడాది అక్టోబర్ 7న ఢిల్లీలో తన వాంగ్మూలాన్ని ఇచ్చారని సీబీఐ తెలిపింది. తన వద్ద ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవని, అయితే రాజకీయ కారణాలతో హత్యకు పాల్పడ్డారని వైఎస్ షర్మిల చెప్పినట్లు వివరించింది. హత్య వెనుక కుటుంబ లేదా ఆర్థిక అంశాల ప్రమేయం లేదని విషయాన్ని కూడా ఖండించినట్లు పేర్కొంది. కడప ఎంపీగా పోటీ చేయాలని తనని వైఎస్ వివేకా కోరారని… ఎంపీగా అవినాష్‌ పోటీ చేయొద్దని కోరుకుంటున్నట్లు షర్మిల చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు షర్మిలను సాక్షిగా చేర్చటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అబ్బాయే బాబాయ్‌ని చంపేశాడు. అది జగనాసుర రక్త చరిత్ర అని షర్మిల కూడా తేల్చేశారంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. బాబాయ్‌ని చంపింది తన అన్నే కావొచ్చని షర్మిల వాంగ్మూలం ఇచ్చారని… రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని షర్మిల చెప్పారని లోకేశ్ అన్నారు.

మొత్తంగా వైఎస్ షర్మిలతో పాటు ఇతర సాక్షుల వాంగూల్మం వెలుగులోకి రావటంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అయింది. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తదుపరి వ్యాసం