తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Bhaskar Reddy Arrest: వివేకా హత్య కేసులో కీలక పరిణామం, వైఎస్ భాస్కరరెడ్డి అరెస్ట్!

YS Bhaskar Reddy Arrest: వివేకా హత్య కేసులో కీలక పరిణామం, వైఎస్ భాస్కరరెడ్డి అరెస్ట్!

HT Telugu Desk HT Telugu

16 April 2023, 8:50 IST

    • YS Bhaskar Reddy Arrest: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
వైఎస్ భాస్కరరెడ్డి
వైఎస్ భాస్కరరెడ్డి

వైఎస్ భాస్కరరెడ్డి

YS Bhaskar Reddy Arrest: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఇంటికి ఆదివారం తెల్లవారుజామున సీబీఐ అధికారులు వెళ్లారు. పులివెందులలో భాస్కరరెడ్డి నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు సుమారు రెండు గంటల పాటు విచారణ చేశారు. అనంతరం భాస్కరరెడ్డిని అరెస్టు చేశారు. భాస్కరరెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కరరెడ్డిని కడపకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటికి కూడా మరో సీబీఐ అధికారుల బృందం చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

AP EAPCET 24: నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌ 2024… విద్యార్థులకు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధన

సాక్ష్యాలు తారుమారులో ఆ ముగ్గురి హస్తం

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. శుక్రవారం ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ... ఇవాళ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో కలిసి వైఎస్‌ భాస్కరరెడ్డి ఇంట్లోనే ఉదయ్‌ కుమార్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా సీబీఐ గుర్తించారు. వివేకా హత్య కుట్రలో ఉదయ్‌కుమార్‌రెడ్డి పాత్ర కూడా ఉందనే అనుమానంతో అతడిని అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో అవినాష్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకే సీబీఐ అధికారులు ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. మరోసారి అవినాష్ రెడ్డి పేరును సీబీఐ ఈ రిపోర్టులో ప్రస్తావించింది. ముగ్గురు వ్యక్తులు కలిసి వివేకా హత్య అనంతరం సాక్ష్యాలు ధ్వంసం చేశారని తెలిపింది. హత్య జరిగిన రోజు అవినాష్ ఇంట్లోనే ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నాడని వెల్లడించింది. గూగుల్‌ టేక్‌ అవుట్‌ ఆధారంగా ఆధారాలు లభించినట్టు పేర్కొంది. వివేక చనిపోయారని విషయం తెలుసుకున్న రెండు నిమిషాలకే వివేకా ఇంటికి అవినాష్, ఉదయ్, శివశంకర్ రెడ్డి చేరుకున్నారని సీబీఐ వెల్లడించింది. సాక్ష్యాల తారుమారులో ఈ ముగ్గురి హస్తం ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది.

గుండెపోటుగా చిత్రీకరణ

వివేకా హత్య తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లాడని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. గూగుల్ టెక్ అవుట్ లోకేషన్ లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. ఉదయ్ కుమార్ తన తండ్రి ప్రకాష్ రెడ్డితో వివేకా మృతదేహానికి కుట్లు వేయించారని తెలిపింది. అవినాష్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడని పేర్కొంది. వివేకా చనిపోయాడని తెలిసే వరకు వీరంతా ఇంట్లోనే ఉన్నారని, మృతి చెందాడని వార్త తెలియగానే అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెండు నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారని స్పష్టం చేసింది. బాత్రూం నుంచి వివేకా మృతదేహాన్ని బెడ్ రూమ్ కి ఉదయ్ కుమార్ తీసుకువచ్చాడని, తలకున్న గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వివేకాకు గుండెపోటు అనే చిత్రీకరించడంలో వీరి పాత్ర చాలా కీలకంగా ఉందని సీబీఐ వెల్లడించింది.

తదుపరి వ్యాసం