తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh : వ్యూహం సినిమా నిర్మాత సీఎం జగనే - నారా లోకేశ్

Nara Lokesh : వ్యూహం సినిమా నిర్మాత సీఎం జగనే - నారా లోకేశ్

29 December 2023, 15:08 IST

    • Nara Lokesh On Vyuham Movie : వ్యూహం సినిమాపై స్పందించారు నారా లోకేశ్. ఆ మూవీ  నిర్మాత సీఎం జగన్మోహన్ రెడ్డే అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లడం, సినిమాలు తీయడం కొందరికి అలవాటుగా మారిందన్నారు లోకేశ్.
నారా లోకేశ్
నారా లోకేశ్

నారా లోకేశ్

Nara Lokesh : ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లడం, సినిమాలు తీయడం కొందరికి అలవాటుగా మారిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం మీడియాతో మాట్లాడిన ఆయన… ఈ సినిమా వివాదంపై స్పందించారు. వ్యూహం సినిమా బడ్జెట్ అంతా జగన్ దే అని…. ఇప్పటికే ఆ సినిమా డైరక్టర్ రెండుమూడుసార్లు జగన్ ను కలిశారని చెప్పారు. రాంగోపాల్ వర్మ తరపున న్యాయపోరాటం చేస్తున్న లాయర్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు అని… ఆయన తెలంగాణా హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? అని ప్రశ్నించారు. దీని వెనుక ప్రభుత్వం ఉందన్న లోకేశ్… సినిమా తీయాలంటే హు కిల్డ్ బాబాయ్, కోడికత్తి, ప్యాలెస్ కుట్రలపై తీయవచ్చు కదా అంటూ సెటైర్లు విసిరారు. లేనిది ఉన్నట్టు చూపితే తాము పోరాడతామని… మాకు ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉందన్నారు. స్టేట్, సెంట్రల్ సెన్సార్ బోర్డులకు లేఖలు రాశాం పట్టించుకోలేదని.. అందుకే కోర్టుకెళ్లామని చెప్పారు. న్యాయస్థానంలో వచ్చే తీర్పును బట్టి ముందుకు వెళ్తామన్నారు లోకేశ్.

ట్రెండింగ్ వార్తలు

Akhila Priya Bodyguard Attacked : అఖిల ప్రియ బాడీగార్డ్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-ఐదుగురిపై కేసు నమోదు

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

జనవరి 4 నుంచి జయహో బీసీ

రాష్ట్రంలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బిసి పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. “జయహో బిసి కార్యక్రమ నిర్వహణపై తొలుత చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఒక వర్క్ షాపు ఏర్పాటు చేసుకుంటాం. జనవరి 4వ తేదీనుంచి పార్లమెంటు, అసెంబ్లీ మండలస్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తాం. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఒక భారీ సభ ఏర్పాటుచేసి బిసి సోదరులకు మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించాం. యువగళం పాదయాత్రలో బిసి సోదరులు పడుతున్న ఇబ్బందులు నేను తెలుసుకున్నాను, నేను తిరగని మండలాల్లో కూడా జయహో బిసి ద్వారా సమస్యలు తెలుసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది” అని లోకేశ్ తెలిపారు.

“బిసి సోదరుల ద్రోహి జగన్. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చాక అనేకమంది బిసిలను అత్యంత అమానవీయంగా చంపేశారు. అమర్ నాథ్ గౌడ్ అక్కను వైసిపి నాయకులు వేధిస్తున్నారని చెబితే, ఆ బాలుడి పుస్తకం చించి కాగితాలను నోటిలో కుక్కి, పెట్రోలు పోసి కాల్చేశారు. ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి గానీ, వైసిపినేతలుగానీ కనీసం పరామర్శించలేదు. అమర్నాథ్ గౌడ్ ను హత్యచేసిన హంతకుడు బయట దర్జాగా తిరుగుతున్నాడు. నిందితుడ్ని వైసిపి నాయకులు ఊరేగించి ఇంటికి తీసుకెళ్లారు. పొద్దుటూరులో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోరాడినందుకు నందం సుబ్బయ్యను దారుణంగా నరికిచంపారు. ఆయన శవాన్ని చూడటానికి కూడా జనం భయపడ్డారు. సుబ్బయ్య భార్య అపరాజిత ఇప్పుడు న్యాయపోరాటం చేస్తోంది. శ్రీకాళహస్తిలో మునిరాజమ్మ అనే మహిళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎమ్మెల్యే ఆమె షాపును ధ్వంసం చేయించారు. కాళ్లు పట్టుకుంటే వదిలేస్తామని బెదిరించారు. వైసిపి పాలనలో కల్లుగీత కార్మికులు, స్వర్ణకారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు” అని లోకేశ్ విమర్శించారు.

జనసేనతో అద్భుత సమన్వయం ఉంది

జనసేన పార్టీతో మాకు అద్భుతమైన సమన్వయం ఉందన్నారు లోకేశ్. “బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో మావారితో జనసైనికులు కలిసి తిరుగుతున్నారు, లేదని మీరు ఎలా చెబుతారు? పండుగ తర్వాత మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. ఎన్నికల షెడ్యూలు ఎనౌన్స్ చేశాక అభ్యర్థులను ఎంపికచేస్తాం, అంతర్గతంగా చాలామందికి పనిచేసుకోమని అధ్యక్షుడు చెప్పారు, సరైన సమయం అభ్యర్థులను అధ్యక్షులు ప్రకటిస్తారు. రాష్ట్రంలో అనేకమంది ఉద్యోగులు తమ డిమాండ్లపై రోడ్డెక్కుతున్నారు. అంగన్ వాడీ, విద్యుత్, ఎస్ఎస్ఎ, ఆరోగ్య శ్రీ ఉద్యోగులు... ఇలా ప్రతిఒక్కరూ రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. వైసిపి ప్రభుత్వం దివాలా తీసింది, డబ్బుల్లేవు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను మా ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తాం. గతంలో చెప్పకపోయినా అంగన్ వాడీల జీతాలు పెంచాం, అధికారంలోకి వచ్చాక అంగన్ వాడీలను ఆదుకుంటామని స్వయంగా హామీ ఇచ్చాం” అని లోకేశ్ చెప్పుకొచ్చారు.

తదుపరి వ్యాసం