తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Tour Package: రాజమండ్రి టూ తిరుమల, తిరుచానూరు - ఈ టూర్ ప్యాకేజీ చూడండి

IRCTC Tour Package: రాజమండ్రి టూ తిరుమల, తిరుచానూరు - ఈ టూర్ ప్యాకేజీ చూడండి

HT Telugu Desk HT Telugu

29 September 2022, 12:06 IST

    • Rajahmundry Tirumala Tour Package: రాజమండ్రి నుంచి తిరుమల టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
రాజమండ్రి తిరుమల టూర్ ప్యాకేజీ
రాజమండ్రి తిరుమల టూర్ ప్యాకేజీ (www.irctctourism.com)

రాజమండ్రి తిరుమల టూర్ ప్యాకేజీ

irctc tourism announced tirumala tour tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా రాజమండ్రి నుంచి తిరుమల, తిరుచానూరు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. VIJAY GOVINDAM పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు ప్రాంతాలకు వెళ్తారు.ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.....

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

rajahmundry tirumala tour : అక్టోబర్ 7 వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 1: సామల్ కోట జంక్షన్ వద్ద నుంటి సాయంత్రం 05.40 నిమిషాలకు ట్రైన్ బయల్దేరుతుంది. ఇక రాజమండ్రి నుంచి సాయంత్రం 06.20 నిమిషాలు, విజయవాడ వద్ద నుంచి రాత్రి 10.50, తెనాలి నుంచి రాత్రి 11. 20 నిమిషాలకు రైలు బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day 2: ఉదయం 05.10 నిమిషాలకు ట్రైన్ తిరుపతికి చేరుకుంటుంది. అక్కడ్నుంచి హోటల్ కి వెళ్తారు. మధ్యాహ్నం ఫ్రెష్ అయిన తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్తారు. అనంతరం తిరుచానూరు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ్నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ కు వస్తారు. రాత్రి 10.30 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 3: తెనాలికి అర్ధరాత్రి 01.48 నిమిషాలకు, విజయవాడకు 02:40 గంటలకు, రాజమండ్రికి 05:53, సామల్ కోట జంక్షన్ కు ఉదయం 06:38 గంటలకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ఛార్జీలివే..

vijay govindam tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 7,990 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 6,940 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.6,800 గా ఉంది. కంఫ్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి.

<p>రాజమండ్రి తిరుమల టూర్ ప్యాకేజీ,</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం