తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Firing Issue :రావులపాలెంలో కాల్పుల కలకలం

Firing Issue :రావులపాలెంలో కాల్పుల కలకలం

HT Telugu Desk HT Telugu

05 September 2022, 13:32 IST

    • కోనసీమ జిల్లా రావులపాలెంలో తుపాకీ కాల్పులు ఘటన కలకలం రేపింది. ఫైనాన్స్‌ వ్యాపారిపై అగంతుకులు తుపాకీతో కాల్పులకు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. ఘటన తర్వాత కూడా బాధితుడిపై దాడి చేసిందెవరనే విషయంలో మిస్టరీ వీడలేదు. 
కోనసమీ జిల్లా రావులపాలెంలో తుపాకీ కాల్పుల కలకలం
కోనసమీ జిల్లా రావులపాలెంలో తుపాకీ కాల్పుల కలకలం (HT_PRINT)

కోనసమీ జిల్లా రావులపాలెంలో తుపాకీ కాల్పుల కలకలం

కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల కలకం చోటు చేసుకుంది. ఫైనాన్స్‌ వ్యాపారి సత్యనారాయణ రెడ్డిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. దాడిని ఆయన కుమారుడు ఆదిత్యరెడ్డి అడ్డుకున్నారు. పెనుగులాటలో తుపాకీ జారి కింద పడిపోయింది. బాధితుల కేకలతో స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు. దుండగుల చేతి సంచి అక్కడే పడిపోయింది. అందులో నాటుబాంబులు, జామర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

నిందితులపై జరిగిన పెనుగులాటలో ఆదిత్యరెడ్డికి గాయాలయ్యాయి. నిందితుల నుంచి తుపాకీని లాక్కునే క్రమంలో అందులో మ్యాగ్‌‌జైన్‌ జారి కింద పడిపోయింది. దీంతో దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. మరో వ్యక్తి స్థానికులు వెంట పడటంతో చేతిలో ఉన్న సంచి వదిలేసి పారిపోయాడు. అందులో తూటాలతో పాటు రెండు నాటు బాంబులు కూడా ఉన్నట్లు గుర్తించారు.

ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి జరిగిన వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల తనిఖీల్లో దాడి జరగిన ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. నిందితులు దేశవాళీ తయారీ తుపాకీతో కాల్పులు జరిపినట్లు గుర్తించారు. తుపాకీతో దాడికి కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బాధితుడు సత్యనారాయణ రెడ్డి ఆదివారం మారేడుమిల్లి వెళ్ళి వస్తుండగా కొందరితో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాహనం ఢీకొట్టడంతో కారు పాడైనందుకు మరో బృందంతో సత్యనారయణ రెడ్డికి ఘర్షణ జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో దాడి జరిగి ఉండొచ్చని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫైనాన్స్‌ వ్యాపారం చేసే సత్యనారయణ రెడ్డి, ఆయన కుమారుడు ఆదిత్య రెడ్డి ఇటీవల అంబోజి పేటలో నాలుగు కోట్లతో ఓ భూమిని కొనుగోలు చేశారు. భూమి కొనుగోలు సందర్భంగా తలెత్తిన వివాదం వల్లే ప్రత్యర్ధులు హత్యాయత్నం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గంజాయి అక్రమ రవాణా ముఠాలు ఇటీవలి కాలంలో తుపాకులు వినియోగిస్తున్నాయి. గంజాయి రవాణా ముఠాలకు కూడా ఈ దాడితో సంబంధం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులపై తుపాకులతో దాడి చేయడానికి ఉన్న కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో వాస్తవంగా ఏం జరిగింది అనే దానిపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం