తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Woman Murder: నమ్మించి, ఇంటికి రప్పించి.. భార్యను అత్యంత కిరాతకంగా చంపేసిన భర్త

Woman Murder: నమ్మించి, ఇంటికి రప్పించి.. భార్యను అత్యంత కిరాతకంగా చంపేసిన భర్త

HT Telugu Desk HT Telugu

28 April 2023, 17:57 IST

    • West Godavari district Crime News: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్యను భర్త అత్యంత కిరాతకంగా హతమార్చాడు. 
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

Wife Murdered By Husband in AP: మద్యానికి బానిసైన భర్త... భార్యను అత్యంత దారుణంగా హత్య చేశారు. నిద్రలో ఉన్న భార్యను గొడలితో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో చోటుచేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

గంజి దావీదు, నిర్మల (30) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భార్య నిర్మల తన పిల్లలను పుట్టింట్లో ఉంచి ఉపాధి కోసం కువైట్‌ వెళ్లింది. మరోవైపు భర్త దావీదు మద్యానికి బానిసగా మారాడు. భార్య నుంచి డబ్బుల తీసుకునేందుకు పిల్లలను దారుణంగా కొట్టేవాడు. కేసు నమోదు కావటంతో ఓసారి జైలుకు కూడా వెళ్లాడు. మరోవైపు భార్య కువైట్ నుంచి వచ్చి ఇక్కడే ఉంటుంది. ఇక నుంచి బుద్ధిగా ఉంటానని నమ్మించి... మళ్లీ కుటుంబం చెంతకు చేరాడు. మళ్లీ అదే తీరుతో వేధించటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు.

ఈ ఘటనపై తాడేపల్లిగూడెం డీఎస్పీ బండారి శ్రీనాథ్ మాట్లాడుతూ... " భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన గంజి దావీదును అరెస్ట్ చేశాం. అతనిపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది" అని చెప్పారు.

"గంజి దావీదు మద్యానికి బానిస అయ్యాడు. ఎలాంటి ఉద్యోగం చేయటం లేదు. భార్య, భర్తల మధ్య గొడవలు ఉన్నాయి. గతేడాది నిర్మల ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. పిల్లలను తల్లిదండ్రల వద్దే ఉంచింది. డబ్బుల కోసం పిల్లలను దేవుడు కొట్టేవాడు. ఈ క్రమంలోనే కొడుతున్న వీడియోను రికార్డు చేసి భార్యకు పంపించాడు. దీని ఆధారంగా నిర్మల ఫిర్యాదు చేయటంతో పోలీసులు దావీదును అరెస్ట్ చేశారు. జైలుకు కూడా పంపించారు" అని డీఎస్పీ వివరించారు.

"కొన్ని నెలల తర్వాత.. నిర్మల కువైట్ నుంచి సొంత ఇంటికి చేరింది. దావీదు కూడా జైలు నుంచి బయటికి వచ్చాడు. అత్తగారి ఇంటికి వెళ్లి పద్ధతి మార్చుకున్నట్లు చెప్పాడు. తన మాటలతో వారిని నమ్మించాడు. కుటుంబాన్ని బాగా చేసుకుంటానని చెప్పాడు. అతని మాటలను నమ్మిని వారు... నిర్మలను గురువారం వీరపాలెంకు పంపించారు" అని పేర్కొన్నారు.

"గురువారం అర్ధరాత్రి భార్యాభర్తలకు మళ్లీ గొడవ జరిగింది. దావీదు మళ్లీ మద్యం సేవించి వచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. మెడ, చేయి కోసేశాడు. మృతురాలి చేయిని నరికి ఆమె మరో చేతిలో పెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. దావీదుని అదుపులోకి తీసుకున్నారు" అని డీఎస్పీ శ్రీనాథ్ వివరించారు.

తదుపరి వ్యాసం