తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Ys Jagan : మరణం లేని మహానేత అంబేడ్కర్ - సామాజిక సమతా సంకల్ప సభలో సీఎం జగన్

CM YS Jagan : మరణం లేని మహానేత అంబేడ్కర్ - సామాజిక సమతా సంకల్ప సభలో సీఎం జగన్

19 January 2024, 18:39 IST

    • Ambedkar Statue in Vijayawada: విజయవాడలో తలపెట్టిన సామాజిక సమతా సంకల్ప సభకు హాజయ్యారు ఏపీ సీఎం జగన్. అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాష్కరణ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన ఆయన….. సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందన్నారు.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

Samajika Sadhikara Sabha in Vijayawada: శుక్రవారం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో తలపెట్టిన సామాజిక సమతా సంకల్ప సభలో మాట్లాడారు ఏపీ సీఎం జగన్. ఈ సందర్భంగా అంబేడ్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు. మరణం లేని మహానాయకుడు అంబేడ్కర్ అని అన్నారు. సభలో మాట్లాడుతూ…. పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? అంటూ ప్రశ్నించారు. అంటరానితనం తన రూపం మార్చుకుందన్నారు. పేదలను దూరంగా ఉంచడం మాత్రమే అంటరానితనం కాదు అన్న ఆయన…. పేదవారు ఇంగ్లీష్‌ మీడియం చదవొద్దని కోరుకోవడం కూడా అంటరానితనమే అవుతుందని కామెంట్స్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

అలా అనటం వివక్ష కాదా…?

“పేదలు తెలుగు మీడియంలోనే చదవాలనడం వివక్ష కాదా?.. పేద కులాల వారు ఎప్పటికీ తమ సేవకులుగానే ఉండాలంట.. పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారు.. పేదలు ఆత్మగౌరవంతో బతకొద్దని పెత్తందారు కోరుకుంటున్నారు... పథకాల అమలులో కూడా వివక్ష చూపడం అంటరానితనమే.ప్రభుత్వ ఆస్పత్రులను నీరుగార్చడం.. పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులను ప్రైవేటుకు అమ్మాలని అనుకోవడం రూపం మార్చుకున్నఅంటరానితనమే. ప్రభుత్వ ఆస్పత్రులను నీరుగార్చడం.. పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులను ప్రైవేటుకు అమ్మాలని అనుకోవడం రూపం మార్చుకున్నఅంటరానితనమే. పథకాల కోసం లంచం ఇచ్చుకుంటూ.. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ.. జన్మభూమి కమిటీల చుట్టూ తిప్పుకుంటూ వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అవుతుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఇస్తే.. సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందంటూ కోర్టులకు వెళ్లడం కూడా రూపం మార్చుకున్నఅంటరానితనమే. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పకూడదని కోర్టుల్లో పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్నఅంటరానితనమే - పేద పిల్లలకు ట్యాబులిస్తే.. అందులో చూడకూడనివి వారు చూస్తున్నారంటూ.. వారికి డిజిటల్ లిట్రసీ ఇవ్వకూడదని కుట్రపూరిత రాతలు రాయడం, వాదించడం కూడా రూపం మార్చుకున్నఅంటరానితనమే” అంటూ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ….

“ఈరోజు మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యాల వాడగా ఈరోజు విజయవాడ కనిపిస్తోంది. భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి మహావిగ్రహం స్టాచూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికీ మొత్తం దళిత జాతికి, బహుజనులకు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకూ ఈరోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తున్నాడు. ఈ మహా విగ్రహం ఇది స్టాచూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడూనా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచూ ఆఫ్ లిబర్టీ అని కనిపిస్తుంటుంది. అంటే అమెరికా అని దాన్ని విన్నాం. దాని గురించి మనం మాట్లాడుతాం. కానీ ఇక మీదట నుంచి స్టాచూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని ఇక మీదట నుంచి మారుమోగుతుంది" అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.

ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమన్నారు ముఖ్యమంత్రి జగన్. "అంబేద్కర్ గారు జన్మించిన 133 సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారుమరణించిన 68 సంవత్సరాల తర్వాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈరోజుటికి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకు చేస్తున్నాం, కారణం.. ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతోంది. ఈ దేశంలో పెత్తందారీ తనం మీద, అంటరాని తనం మీద, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద ఆ దుర్మార్గాల మీద అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్పూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహా మనిషి. ఆయన అంటరానితనం మీద ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నా మనకు కనిపిస్తుంటాడు. ఈరోజు దళిత జాతి నిలబడిందన్నా, అల్ప సంఖ్యాకులు నిలబడగలుగుతున్నారన్నా కూడా రిజర్వేషన్లు కల్పించి ఒక్క తాటిపైకి తెచ్చే కార్యక్రమం జరిగిందంటే అంబేద్కర్ గారి స్పూర్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారినవర్గాలకు నింతరం ధైర్యాన్ని, శక్తిని, అండను ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది” అని సీఎం జగన్ అన్నారు.

తదుపరి వ్యాసం