తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Group 1 Mains Syllabus 2024 : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారా..? పరీక్షా విధానం, సిలబస్ ఇదే

AP Group 1 Mains Syllabus 2024 : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారా..? పరీక్షా విధానం, సిలబస్ ఇదే

21 April 2024, 16:15 IST

    • AP Group 1 Mains 2024 Updates: ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో మెయిన్స్(AP Group 1 Mains) పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది ఏపీపీఎస్సీ.
ఏపీ గ్రూప్ 1 మెయిన్స్
ఏపీ గ్రూప్ 1 మెయిన్స్

ఏపీ గ్రూప్ 1 మెయిన్స్

AP Group 1 Mains 2024: కొద్దిరోజుల కిందటే ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాయి. మెయిన్స్ కు అర్హత సాధించిన వారి వివరాలను ప్రకటించింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మెయిన్స్ పరీక్షలను ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకోసం ఏపీపీఎస్సీ(APPSC) కసరత్తు కూడా చేస్తోంది. అర్హత సాధించిన అభ్యర్థులంతా…. మెయిన్స్(AP Group 1 Mains) పై దృష్టి పెట్టారు. మెయిన్స్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది..? సిలబస్ లోని అంశాలెంటో చూద్దాం…!

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Group 1 Mains Exam Patern పరీక్షా విధానం :

ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా(AP Group 1 Mains 2024) విధానం చూస్తే… రెండు క్వాలిఫైయింగ్ పేపర్లతో పాటు ఐదు మెరిట్-ర్యాంకింగ్ పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారే మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్ లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇది 150 మార్కులకు నిర్వహిస్తారు. మరో పేపర్ తెలుగు ఉంటుంది. ఇది కూడా 150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్లుగా పరిగణిస్తారు. ఇక మెయిన్స్ లో చూస్తే పేపర్ 1 జనల్ ఎస్సేలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. భారత దేశ చరిత్రకు సంబంధించి రెండో పేపర్ ఉంటుంది.దీనికి 150 మార్కులు కేటాయించారు. భారత రాజ్యంగం, గవర్నెర్స్ అని మూడో పేపర్ ఉంటుంది. దీనికి 150 మార్కులు కేటాయించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నాల్గో పేపర్ ఉండగా.. దీనికి కూడా 150 మార్కులు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదో పేపర్ గా ఉండగా.. దీనికి కూడా 150 మార్కులు కేటాయించారు. ఇంగ్లీష్ , తెలుగు పేపర్లలో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మిగతా ఐదు పేపర్లలో నుంచి మెరిట్ ను తీసుకుంటారు.

AP Group 1 Mains Syllabus : గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్….

ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ సిలబ(AP Group 1 Mains Syllabus) చూస్తే ఇంగ్లీష్, తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్లు ఉంటాయి. ఇందులో 200 పదాలతో కూడిన వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. లెటర్ రైటింగ్, రిపోర్టింగ్, ఇంగ్లీష్, తెలుగు గ్రామర్ ఉంటాయి. ఇక పేపర్ 1లో చూస్తే....వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. ప్రదానంగా కరెంట్ ఎఫైర్స్ తో పాటు Socio- political issues, Socio- economic issues, Socio- environmental issues, Cultural and historical aspects, Issues related to civic awareness, Reflective topic నుంచి ప్రశ్నలు అడుగుతారు.

  • PAPER-I - GENERAL ESSSAY - 150 మార్కులు ఉంటాయి.
  • PAPER — II: HISTORY, CULTURE AND GEOGRAPHY OF INDIA AND ANDHRA - భారత దేశ చరిత్ర, సంస్కృతితో పాటు ఏపీ చరిత్ర, సంస్కృతి గురించి ప్రశ్నలు ఉంటాయి.
  • PAPER III - POLITY, CONSTITUTION, GOVERNANCE, LAW AND ETHICS - భారత్ రాజ్యాంగం, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. దీనికి 150 మార్కులు కేటాయించారు. సమయం కూడా 150 నిమిషాలు ఉంటుంది.
  • Paper — IV — ECONOMY AND DEVELOPMENT OF INDIA AND ANDHRA PRADESH - భారత దేశ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధితో పాటు ఏపీ ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రశ్నలు వస్తాయి.
  • Paper -V SCIENCE AND T ECHNOLOGY - సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ప్రశ్నలు అడుగుతారు.

కింద ఇచ్చిన పీడీఎఫ్ లో ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల పూర్తి సిలబస్ ను చూడొచ్చు….

తదుపరి వ్యాసం