తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Model Schools : టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

AP Model Schools : టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

HT Telugu Desk HT Telugu

19 May 2023, 18:05 IST

    • AP Model School Inter Admission 2023-24: ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ. ఈ మేరకు దరఖాస్తుల తేదీలతో పాటు మరిన్ని వివరాలను పేర్కొంది.
ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్లు
ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్లు

ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్లు

APMS Inter Admissions 2023-24 Notification: ఏపీ ఆదర్శ పాఠశాలలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశము కొరకు ప్రకటన విడుదలైంది.2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ లో ప్రవేశాల కోసం ఆన్ లైన్ ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సీట్లు పొందినవారికి ఉచిత విద్యను అందిస్తారు. ఈ ఆదర్శ పాఠశాలల్లో ఆంగ్లములోనే బోధిస్తారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.

ట్రెండింగ్ వార్తలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

ప్రవేశ అర్హతలు: సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10 వ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు https://apms.ap.gov.in/apms/ చూడగలరు.

దరఖాస్తు చేయు విధానము - అభ్యర్ధులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ 22.05.2022 నుండి 07.06.2023 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించ బడును. దీని ఆధారంగా వెబ్ సైట్ (https://apms.ap.gov.in/apms/online) లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేయడానికి రుసుము: ఓసీ మరియు బీసీలకు రూ. 200/- (అక్షరములా రెండు వందలు రూపాయలు మాత్రమే ) ఎస్సీ మరియు ఎస్టీలకు రూ. 150/- (అక్షరములా నూటఏభై రూపాయలు మాత్రమే).

ప్రవేశములు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరాలకుకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని /మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలని విద్యాశాఖ కమిషనర్ పేరిట విడుదలైన ప్రకటనలో ఉంది.

AP Model School Admissions Updates: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో ఉండగా మే 10 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూన్ 11న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్ తో తెలుగు/ ఇంగ్లీషు మీడియములో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టైపులో ఉన్న ప్రవేశ పరీక్షలోఓసీ, బీసీ అభ్యర్థులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 30 మార్కులు సాధించాలి. ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించబడతాయి.

తదుపరి వ్యాసం