AP Model School Admissions: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు.. మే 10 నుంచి అప్లికేషన్స్, పరీక్ష ఎప్పుడంటే?-ap model school 6th class admission entrance test on 11th june 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Model School 6th Class Admission Entrance Test On 11th June 2023

AP Model School Admissions: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు.. మే 10 నుంచి అప్లికేషన్స్, పరీక్ష ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu
May 06, 2023 01:23 PM IST

AP Model School Admissions 2023-24: ఏపీ మోడల్ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి జూన్‌ 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు
ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు

AP Model School Admissions Updates: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉతర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో ఉండగా ఈ నెల 10 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. వచ్చే నెల 11న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్ తో తెలుగు/ ఇంగ్లీషు మీడియములో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో మాత్రమే బోధిస్తారని, చదువుకోవడానికి ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదని వివరించారు. ప్రవేశ పరీక్ష కోసం ఓసీ, బీసీ విద్యార్థులు రూ . 150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 లను మే 9 నుంచి మే 25 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి Payment Gateway ద్వారా పరీక్ష రుసుము చెల్లించాలని తెలిపారు. తద్వారా కేటాయించిన జనరల్ నెంబరు ఆధారంగా ఏదైనా ఇంటర్ నెట్ కేంద్రంలో www.cse.ap.gov.in/apms.ap.gov.in దరఖాస్తు చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

ఆబ్జెక్టివ్ టైపులో ఉన్న ప్రవేశ పరీక్షలోఓసీ, బీసీ అభ్యర్థులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 30 మార్కులు సాధించాలి. ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించబడతాయని సురేష్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలి.

ప్రవేశ అర్హతలివే:

1) వయస్సు: ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2011 నుండి 31-08-2013 మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు 01-09-2009 నుండి 31-08-2013 మధ్య జన్మించినవారై ఉండాలి.

2) సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల్లో నిరవధికంగా 2021-22, 2022-23 విద్యా సంవత్సరాలు చదివి, 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.

3) దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in/apms.ap.gov.in చూడాలి.

IPL_Entry_Point