తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bjp On Polavaram : పోలవరంపై వైసీపీ, టీడీపీ డ్రామాలు - ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

AP BJP On Polavaram : పోలవరంపై వైసీపీ, టీడీపీ డ్రామాలు - ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

08 August 2023, 17:13 IST

    • Vishnu Vardhan Reddy  వైసీపీ, టీడీపీలపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

BJP Vishnu Vardhan Reddy ON YCP TDP: పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ, టీడీపీ క్షమాపణలు చెప్పాలని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి భరించేందుకు సిద్ధంగా ఉన్నా రెండు ప్రభుత్వాలు చెరో ఐదేళ్ల పాటు సమయం వృధా చేశాయని ఆరోపించారు. ఇప్పుడు కేంద్రంపై నిందలు వేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేట అన్నారు. ఇటీవల పోలవరం విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య పరస్పర వివాదాలు, వాగ్వాదాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని దుయ్యబట్టారు. తాజాగా సీఎం జగన్ పోలవర నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి కేంద్రం పై నిందలు వేయడం ఆయన చేతకానితనానికి నిధర్శనమన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

పోలవరంపై టీడీపీ , వైసీపీ పరస్పర విమర్శల డ్రామాలతో కప్పించుకోనే ప్రయత్నం చేస్తాయని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు సోమవారం పోలవరం పర్యటించి.. తమ హయాంలో గొప్పగా కట్టామని..జగన్ విఫలమయ్యారని ఓ వైపు... దీనికి రివర్స్‌లో చంద్రబాబు వల్లే పోలవరంలో ఇబ్బందులు వచ్చాయని జగన్ ఆరోపించడం బట్టి చూస్తే ఈ రెండు పార్టీలు ప్రజల్ని మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. పోలవరం విషయంలో తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టులను.. చంద్రబాబు తామే కట్టుకుంటామని తీసుకున్నారని గుర్తు చేశారు విష్ణువర్థన్ రెడ్డి. 2018కే పూర్తి చేస్తామని ప్రకటనలు చేశారని.. కానీ చివరికి ఎటూ కాకుండా చేశారని ఆరోపించారు. ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరింతగా పోలవరం ప్రాజెక్టును ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. కాంట్రాక్టర్లను మళ్లీ మార్చేసి.. ఇప్పుడు కేంద్రంపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. రెండు పార్టీలకూ చేతకాక ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని రాష్ట్ర ప్రజల్ని ముంచేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

పోలవరం విషయంలో కేంద్రం వంద శాతం నిధులిస్తున్నా .. ప్రజలు ఒక్కో సారి అధికారం ఇచ్చినా ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు చేతకాలేదన్నారు. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు చేతకాని పార్టీలు అని విమర్శించారు. ఏపీలో NDA ప్రభుత్వం వస్తుందని,,,. పోలవరం కట్టి చూపిస్తుందన్నారు. ఏపీ ప్రజలకు రెండు ప్రాంతీయ పార్టీలు క్షమాపణలు చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

తదుపరి వ్యాసం