కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. భద్రతా కారణాల రీత్యా సాదాసీదాగా బండి సంజయ్ హోం శాఖ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. సరిగ్గా 11 గంటలకు నార్త్ బ్లాకులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు.