గత వైసీపీ పాలనలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఏపీ హోం మంత్రి వంగల పూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. పేరు మార్చి అమెజాన్ లోనూ అమ్మకాలు సాగిస్తున్నారని అన్నారు. గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత ఒక్క వైసీపీ అధినేత జగన్ కే దక్కుతుందన్నారు. ఇక నుంచి గంజాయి నిర్మూలనకు పాటు పడతామన్న హోం మంత్రి, రాత్రి 8 గంటల తర్వాత ఎక్కడైనా గుంపులుగా యువకులు కనిపిస్తే పోలీసులకు నచ్చిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.