YS Sharmila Tweet: నువ్వెక్కడ..? నీ జాడెక్కడ..? కేటీఆర్ ట్వీట్ కు షర్మిల కౌంటర్-ys sharmila strong counter to ktr tweet on sagara haram ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila Tweet: నువ్వెక్కడ..? నీ జాడెక్కడ..? కేటీఆర్ ట్వీట్ కు షర్మిల కౌంటర్

YS Sharmila Tweet: నువ్వెక్కడ..? నీ జాడెక్కడ..? కేటీఆర్ ట్వీట్ కు షర్మిల కౌంటర్

HT Telugu Desk HT Telugu
Oct 01, 2022 04:30 PM IST

ys sharmila vs ktr: మంత్రి కేటీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ 30 సందర్భంగా కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ కు కౌంటర్ ఇస్తూ పలు ప్రశ్నలు సంధించారు.

వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)
వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో) (twitter)

ys sharmila tweet on ktr: తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులను ఆదుకోవడంతో నువ్వెక్కడ? నీ జాడెక్కడ అంటూ కేటీఆర్‌ ని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 30న తలపెట్టిన సాగరహారాన్ని గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఇందుకు ఓ ఫొటోను కూడా జత చేశారు. ప్రతిరోజు విమర్శలు చేసే ప్రతిపక్ష రేవంత్ రెడ్డి, బండి సంజయ్, వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వారు ఉద్యమంలో ఎక్కడున్నారంటూ కౌంటర్ విసిరారు.

అయితే కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయంగా హీట్ ను పెంచిందనే చెప్పాలి. ఓవైపు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించగా... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కొన్ని ఫొటోలను జత చేస్తూ జవాబునిచ్చారు. ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ కు వైఎస్ షర్మిల మాత్రం జవాబు గట్టిగా ఇస్తూనే కొన్ని ప్రశ్నాలను సంధించారు.

'వచ్చిన తెలంగాణలో,కొట్లాడిన ఉద్యమకారులను ఆదుకోవడంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ?కొలువుల కోసం ఆత్మహత్య చేసుకొన్న నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవడంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ? పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవడంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ?పోడు పట్టాల కోసం ఆదివాసీల మీద దాడులు జరిగితే నువ్వెక్కడ? నీ జాడెక్కడ? వరద ప్రాంతాలను సందర్శించి, రోడ్డున పడ్డ కుటుంబాలకు సాయం అందించడంలో నువ్వెక్కడ? నీ జాడెక్కడ? దీక్షలు చేసే VRAల పోరాటంలో, ఉపాధ్యాయుల స్పౌజ్ బదిలీల పోరాటంలో నువ్వెక్కడ? నీ జాడెక్కడ? కరోనాతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ? అధికారంలో ఉండి సమస్యలు పరిష్కరించకుండా,జనాన్ని చచ్చేలా చేస్తున్న KTR గారు మీరా?నన్ను నువ్వెక్కడా అని ప్రశ్నించేది.. ? అధికారం లేకున్నా ప్రజలకు అండగా ఉండటంలో నేనున్నా! ప్రజలను ఆదుకోవడంలో నేనున్నా! జనంతో నేనున్నా! జనంలో నేనున్నా! జనం వెంటే నేను,జనంలోనే నేను' అంటూ రాసుకొచ్చారు.

ఇక బీఎస్పీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ ఆర్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ ట్వీట్ కు స్పందించారు. అయ్యా ట్విట్టర్ పిట్ట అంటూ మొదలుపెట్టిన ఆయన... తమరు ఆరోజు ఆంధ్రా పెత్తందార్ల ఫౌంహౌసుల్లో విందుల్లో మునిగి తేలుతూ ఉన్నారని విమర్శించారు. తెలంగాణ విద్యార్థి బిడ్డల ప్రాణాలను నాటి ఆంధ్రా పోలీసుల బారి నుంచి తాను కాపాడనని చెప్పుకొచ్చారు. అమరవీరుల శవాలను కూడా మోసిన అంటూ కౌంటర్ ఇచ్చారు.