GO 111: జీవో 111 ఎత్తివేత... మరో నగరం నిర్మాణం కాబోతుందా..?-what are the benefits of the go 111 withdraw ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Go 111: జీవో 111 ఎత్తివేత... మరో నగరం నిర్మాణం కాబోతుందా..?

GO 111: జీవో 111 ఎత్తివేత... మరో నగరం నిర్మాణం కాబోతుందా..?

HT Telugu Desk HT Telugu
May 20, 2023 07:56 AM IST

GO 111 Withdraw: ఎప్పటి నుంచో వివాదం నడుస్తున్న జీవో 111 ను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. ఇందుకు కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఇక అందరిచూపు ఆ ప్రాంతంపై పడింది. రియల్ రంగం దూసుకెళ్లటం ఖాయమని.. హైదరాబాద్తో పాటు సమాంతరంగా మరో నగరం నిర్మాణం జరగటం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జీవో 111 ఎత్తివేత
జీవో 111 ఎత్తివేత

GO 111 Withdraw Latest News: జీవో 111 ఎత్తివేతకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ అంశంపై గతంలోనే అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 111 జీవో రద్దుకు కేబినెట్ ఆమోదం తెలపటంతో....84 గ్రామాల పరిధిలో సంబరాలు మిన్నంటాయి. తమ ప్రాంతం ఇక అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తుందని స్థానికులు అభిప్రాయపడుతుంటే.... పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలతో పాటు పలు పార్టీలు జీవో 111 ఎత్తివేతను ఖండిస్తున్నాయి. కేవలం రియల్ దందా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉన్నప్పటికీ... హైదరాబాద్ నగరానికి సమాంతరంగా మరో నగరం నిర్మాణం కాబోతుందన్న చర్చ జోరందుకుంది.

ఇదిలా ఉన్నప్పటికీ... హైదరాబాద్ నగరానికి సమాంతరంగా మరో నగరం నిర్మాణం కాబోతుందన్న చర్చ జోరందుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇండ్ల ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. నగరంలో కూడా అపార్ట్ మెంట్ ధరలు కూడా తగుతాయని చెబుతున్నారు. ఫలితంగా 84 గ్రామాలకు మహర్దశ రాబోతుందని అంటున్నారు. అయితే జీవో 111 అంటే ఏంటి? అసలు దీని వెనుక ఉన్న నేపథ్యం...? ఎందుకు జీవో ఎత్తివేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంది? వంటి అంశాలను చూస్తే.....

1996లో జోవో…

నిజాం పాలకుల సమయంలో జంట జలాశయాలు.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. హైదరాబాద్ వాసులకు ఇక్కడి నుంచే తాగు నీరు. అవి లేకుంటే.. హైదరాబాద్ నగరానికి కష్టంగా ఉండేదేమో. ఇలాంటి ముఖ్యమైన జలాశయాలను కాపాడాలనే ఉద్దేశంతో.. 1996లో 111 జీవోను తెచ్చింది అప్పటి ప్రభుత్వం. జలాశయాల్లో నీటి కలుషితం చేయకుండా ఉండటం దీని ముఖ్య ఉద్దేశం. నిజానికి 1994లో జీవో 192 తీసుకొచ్చారు. గండిపేట చెరువు దగ్గరలో ఓ రసాయన పరిశ్రమను ఏర్పాటు చేయడంతో.. జీవోను తెచ్చారు. అయితే.., మళ్లీ 1996లో సవరించి జీవో 111గా ఛేంజ్ చేశారు. అలా జీవోలో అనేక నిబంధనలు పెట్టారు.

జీవోలో ఏం ఉందంటే..

జీవో ప్రకారంగా చూసుకుంటే.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల చుట్టూ 10 కిలోమిటర్ల పరిధిలో బయో కన్జర్వేషన్ జోన్ గా ఉంటుంది. ఆ చెరువుల పరిధిలోని లే అవుట్లలో 60 శాతం ఖాళీ స్థలం విడిచిపెట్టాలి. గ్రామ కంఠాన్ని పక్కనపెడితే.. మిగిలిన చోట్లా భూమిలో 10 శాతమే నిర్మాణాలు ఉండాలి. చుట్టుపక్కల క్రిమి సంహారక మందుల వినియోగంపై అబ్జర్వేషన్ ఉండాలి. రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాలకు చెందిన 84 గ్రామాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతం మెుత్తం విస్తీర్ణం ఎంతంటే.. 538 చదరపు కిలోమీటర్లు. మరో హైదరాబాద్ అన్నమాట. ఈ 84 గ్రామాల్లోని లక్షా 32 వేల ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. ఇంతటి భూమి భాగ్యనగరానికి దగ్గరలో ఉంది. కేవలం వ్యవసాయ కార్యకలాపాలే కేటాయించాలని ఆదేశించడంతో రియల్ ఎస్టేట్ సహా అనేక కార్యకలాపాలకు జరగట్లేదు. శంషాబాద్ మండల పరిధిలోని 47 గ్రామాలు, మొయినాబాద్ మండలంలోని 20 గ్రామాలు దీని కిందకు వస్తాయి. చేవెళ్ల పరిధిలోని 6 గ్రామాలు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి మండలాల నుంచి 3 గ్రామాలు, షాబాద్ మండలం 2 గ్రామాలు, కొత్తూరు మండలం ఒక గ్రామం కూడా జీవో కిందకే వస్తాయి.

జీవో ఎత్తివేయడంతో ఇక్కడి భూముల ధరలు భారీగా పెరుగుతాయి. అంతకుముందు హైదరాబాద్ శివార్లలో భూముల ధరలు పెరిగినా.. కూడా జీవో 111 అమలులో ఉంది కాబట్టి.. ఈ గ్రామాల్లో మాత్రం భూముల ధరలు పెరగలేదు. భూములు కొనేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలిపారు. జీవో వ్యతిరేక పోరాట సమితిని కూడా ఏర్పాటు చేశారు. మహానగరానికి దగ్గరలోనే ఈ భూములు ఉండటంతో.. ఇప్పుడు జీవో ఎత్తివేతతో మరో హైదరాబాద్ నిర్మించవచ్చనే.. అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

అయితే ఎన్ని నిబంధనలు ఉన్నా.. దందా చేసేవారు.. ఆగలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బడాబాబులు.. ఇక్కడ భూములు కొని.., ఫామ్ హౌసులు, విల్లాలు కట్టారు. ఇక పార్టీల ప్రచారాల్లోనూ.. దీనిపై తప్పకుడా హామీ ఉండేది. అధికారం వస్తే.. జీవో ఎత్తివేస్తామని చెప్పేవారు. నాణేనానికి రెండు వైపులా అన్నట్టుగా.. కొంతమంది స్థానికులు సైతం.. ఈ జీవో ఎప్పుడు ఎత్తివేస్తారా అని కూడా చూశారు. మరోవైపు కొంతమంది పర్యావరణ వేత్తలు.. జీవోను.. ఎత్తివేయెుద్దని కోర్టుల చుట్టూ తిరిగారు. జీవో సంగతి పూర్తిగా తేల్చేయాలని ప్రభుత్వం అనుకుంది. అందులో భాగంగానే.. 2016లో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

111 జీవో అర్థరహితం అనేది ప్రభుత్వ వాదన. ఈ జీవో పరిధిలో లక్షా 32 వేల 600 ఎకరాల భూమిని గతంలో జంట జలాశయాల పరిరక్షణ కోసం ఇచ్చారని చెబుతోంది. అయితే హైదరాబాద్ నగర అవసరాలను తీర్చడం కోసం ఇప్పుడు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు వస్తోందని ప్రభుత్వం అంటోంది. వందేళ్లు నగరానికి తాగునీటి కొరత ఉండదని.. 111 జీవోకు అర్థం లేదంటోంది. విలువైన భూములు ఖాళిగా ఉంటున్నాయని వాదన. అందులో భాగంగానే.. జీవో 111పై తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం