వేదాంత తెలంగాణకు రానుందా? విద్యుత్తు, నీళ్లు ప్లస్ కానున్నాయా?-vedanta seeks free land cheap water power in race to be india s first chipmakersources ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  వేదాంత తెలంగాణకు రానుందా? విద్యుత్తు, నీళ్లు ప్లస్ కానున్నాయా?

వేదాంత తెలంగాణకు రానుందా? విద్యుత్తు, నీళ్లు ప్లస్ కానున్నాయా?

HT Telugu Desk HT Telugu
Apr 28, 2022 04:29 PM IST

న్యూఢిల్లీ: భారతదేశపు మొట్టమొదటి చిప్ తయారీదారుగా అవతరించే క్రమంలో వేదాంత లిమిటెడ్ సెమీకండక్టర్, డిస్ ప్లే తయారీకి 20 బిలియన్ డాలర్లతో పెట్టే పరిశ్రమ కోసం రాష్ట్రాల నుంచి 1,000 ఎకరాల ఉచిత భూమిని, ఇతర ప్రోత్సాహకాలను కోరుతోంది.

<p>చిప్ తయారీ పరిశ్రమలోకి వేదాంత</p>
<p>చిప్ తయారీ పరిశ్రమలోకి వేదాంత</p> (REUTERS)

చముు నుంచి మెటల్స్ వరకు అనేక ఉత్పత్తుల తయారీ సంస్థగా ఉన్న వేదాంత లిమిటెడ్ చిప్ తయారీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా తమ పోర్ట్‌ఫోలియో వైవిధ్యభరితంగా మారుతుందని ఫిబ్రవరిలోనే తెలిపింది. భారతదేశాన్ని సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రణాళికలకు మద్దతుగా తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా అప్పుడు ప్రకటించింది.

కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని కోరుతుండడమే కాకుండా 99 సంవత్సరాల పాటు ఉచితంగా లీజుకు అందించేలా 1,000 ఎకరాల భూమి ఇవ్వాలని రాష్ట్రాలను కోరుతున్నట్టు తెలుస్తోంది. సొంత అవసరాలకు 700 ఎకరాలు, మిగిలినది అనుబంధాల కోసం వినియోగించనుంది.

రాష్ట్ర ప్రభుత్వాలకు 20 ఏళ్లలో 2.2 డాలర్ల బిలియన్ల పన్ను ఆదాయాన్ని సమకూర్చడంలో తమ కార్యకలాపాలు సహాయపడతాయని వేదాంత లిమిటెడ్ చెబుతోంది. 100,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించడానికి దోహదపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కంపెనీ ముఖ్యంగా దక్షిణాన తెలంగాణ, కర్ణాటక, పశ్చిమాన మహారాష్ట్ర నుండి వచ్చిన ప్రతిపాదనలను సమీక్షిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అయితే దీనిపై కామెంట్ కోసం చేసిన అభ్యర్థనకు వేదాంత స్పందించలేదు. మూడు రాష్ట్రాల్లోని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రతినిధులు వెంటనే స్పందించలేదు.

ప్రపంచంలో చిప్ అవుట్‌పుట్ తైవాన్, యునైటెడ్ స్టేట్స్ వంటి కొన్ని దేశాలకు పరిమితమైంది. భారతదేశం ఈమార్కెట్లో ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, ఇప్పుడు కంపెనీలను చురుకుగా ఆకర్షిస్తోంది. డిసెంబర్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీలో కొత్త శకాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

2020లో 15 బిలియన్ డాలర్ల నుండి, భారతీయ సెమీకండక్టర్ మార్కెట్ 2026 నాటికి 63 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.

చిప్ ప్లాంట్లు సాధారణంగా విద్యుత్, నీటిని భారీ పరిమాణంలో వినియోగిస్తాయి. వేదాంత 20 సంవత్సరాల కాలానికి రాయితీ, స్థిరమైన ధరలకు నీరు, విద్యుత్‌ను డిమాండ్ చేస్తోందని వర్గాలు తెలిపాయి. 

వేదాంత తన ప్లాంట్లు చివరికి రోజుకు 40 మిలియన్ లీటర్ల నీటిని వినియోగిస్తుందని అంచనా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 300,000 కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న నగరానికి ఇది సుమారుగా అవసరమైన నీటి పరిమాణం. 

విడిగా, మోడీ ప్రభుత్వం ప్రాజెక్ట్ మూలధన వ్యయంపై 50% ఫైనాన్సింగ్ మద్దతును అందించే వీలున్నప్పటికీ.. వేదాంత రాష్ట్రాల నుండి అదనపు ప్రోత్సాహకాలను కోరుతోంది.

తెలంగాణలో తగినంత విద్యత్తు, నీటి సరఫరా ఉన్నందున సెమీ కండక్టర్ల పరిశ్రమ దక్కే అవకాశాలు విరివిగా కనిపిస్తున్నాయి.

(నోట్: ఏజెన్సీ ఇన్‌పుట్స్ సహాయంతో రాసిన కథనం)