Nirmala Sitharaman Serious: వారి వాటా ఎంత..? కలెక్టర్ ని నిలదీసిన కేంద్రమంత్రి-union minister nirmala sitharaman serious on kamareddy district collector ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nirmala Sitharaman Serious: వారి వాటా ఎంత..? కలెక్టర్ ని నిలదీసిన కేంద్రమంత్రి

Nirmala Sitharaman Serious: వారి వాటా ఎంత..? కలెక్టర్ ని నిలదీసిన కేంద్రమంత్రి

Mahendra Maheshwaram HT Telugu
Sep 02, 2022 06:38 PM IST

Union Minister Nirmala Sitharaman: కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాపై ప్రశ్నించిన ఆమె... ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

కలెక్టర్​పై నిర్మలా సీతారామన్​ ఆగ్రహం
కలెక్టర్​పై నిర్మలా సీతారామన్​ ఆగ్రహం (twitter)

Union Minister Nirmala Sitharaman Fires On District Collector: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం బీర్కూర్‌లోని ఓ రేషన్ దుకాణాన్ని సందర్శించారు. రేషన్ వివరాలను కలెక్టర్ జితేష్ పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద ఎంత బియ్యం పంపిణీ చేశారని ప్రశ్నించారు. పేదలకిచ్చే బియ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నాయో చెప్పాలని నిలదీశారు. ఆయన సమాధానం చెప్పకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

union minister nirmala sitharaman kamareddy tour: రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 30 రూపాయలు ఇస్తోందని కేంద్రమంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదు రూపాయలు ఖర్చు చేస్తుందని... ప్రజలకు అసలు విషయం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే పర్యటిస్తున్నట్లు స్పష్టం చేశారు.

రేషన్‌ దుకాణం వద్ద పెట్టిన ఫ్లెక్సీలో ప్రధానమంత్రి మోదీ ఫొటో లేకపోవడంపై కలెక్టర్‌ను ప్రశ్నించారు నిర్మలా సీతారామన్. మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ప్రధాని ఫొటో ఉండాలని నిర్మలా సీతారామన్‌ ఆదేశించారు. అంతకుముందు కోటగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత టీకా కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఇక కలెక్టర్ తో కేంద్రమంత్రి మధ్య సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

union minister nirmala sitharaman fires on district collector:కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం బీర్కూర్‌లోని ఓ రేషన్ దుకాణాన్ని సందర్శించారు. రేషన్ వివరాలను కలెక్టర్ జితేష్ పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద ఎంత బియ్యం పంపిణీ చేశారని ప్రశ్నించారు. పేదలకిచ్చే బియ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నాయో చెప్పాలని నిలదీశారు. ఆయన సమాధానం చెప్పకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

union minister nirmala sitharaman kamareddy tour: రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 30 రూపాయలు ఇస్తోందని కేంద్రమంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదు రూపాయలు ఖర్చు చేస్తుందని... ప్రజలకు అసలు విషయం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే పర్యటిస్తున్నట్లు స్పష్టం చేశారు.

రేషన్‌ దుకాణం వద్ద పెట్టిన ఫ్లెక్సీలో ప్రధానమంత్రి మోదీ ఫొటో లేకపోవడంపై కలెక్టర్‌ను ప్రశ్నించారు నిర్మలా సీతారామన్. మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ప్రధాని ఫొటో ఉండాలని నిర్మలా సీతారామన్‌ ఆదేశించారు. అంతకుముందు కోటగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత టీకా కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఇక కలెక్టర్ తో కేంద్రమంత్రి మధ్య సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆర్థిక మంత్రి హరీశ్ రావ్ ఫైర్...

minister harish rao fire to nirmala sitharaman: మరోవైపు ఆయుష్మాన్ భారత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పలు వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పై రాష్ట్ర మంత్రి హరీశ్ రావ్ ఫైర్ అయ్యారు. తూప్రాన్ లో మాట్లాడిన ఆయన...రాష్ట్రానికి వచ్చి అబద్ధాలు మాట్లాడి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. ఆయుష్మాన్‌ భారత్‌లో చేరలేదని నిర్మలా సీతారామన్‌ అసత్యాలు చెబుతున్నారన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి హరీశ్​రావు సవాల్​ విసిరారు. వెంటనే ఆమె తెలంగాణ ప్రజలకు నిర్మల్‌ సీతారామామన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

IPL_Entry_Point

టాపిక్