TSNPDCL TSSPDCL AE Results: ఏఈ ఉద్యోగ ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్‌ ఇదే-tsnpdcl and tsspdcl announced assistant engineer exam 2022 results check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsnpdcl Tsspdcl Ae Results: ఏఈ ఉద్యోగ ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్‌ ఇదే

TSNPDCL TSSPDCL AE Results: ఏఈ ఉద్యోగ ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్‌ ఇదే

HT Telugu Desk HT Telugu
Sep 09, 2022 01:52 PM IST

Assistant Engineer Exam Results 2022: ఎన్పీడీసీఎల్‌ పరిధిలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఏఈ ఉద్యోగాల ఫలితాలు కూడా వచ్చాయి.

<p>ఏఈ పరీక్షా ఫలితాలు విడుదల,</p>
ఏఈ పరీక్షా ఫలితాలు విడుదల, (facebook)

TSNPDCL AE Result 2022: నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ ఏఈ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. గత నెల 14న 82 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://tsnpdcl.cgg.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

tsspdcl ae exam results: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో 70 అసిస్టెంట్‌ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి జూలై 17న నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను గురువారం సంస్థ యాజమాన్యం ప్రకటించింది. www.tssouthernpower.com వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

మొత్తం 70 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో 16 పోస్టులు ఓపెన్‌ కేటగిరీలో ఉన్నాయి. అంతేకాదు.. ఇవి కాక ఓపెన్‌ కేటగిరీలో మరో 9 పోస్టులు మహిళలకు రిజర్వ్‌ చేశారు.

ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం శిక్షణతో సహా రెండేళ్ల పాటు ప్రొబేషన్‌లో ఉంటారు. ఉద్యోగంలో చేరే సమయంలో అభ్యర్థులు పుట్టిన తేదీ (SSC), డిగ్రీ, కులం, నివాస ధృవీకరణ ఒరిజినల్ సర్టిఫికేట్‌లను డిపాజిట్ చేయాలి. ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ వ్యవధిలో అభ్యర్థులకు అసిస్టెంట్ ఇంజనీర్ కు చెల్లించే స్కేల్ ఆఫ్ పే చెల్లిస్తారు. సెలక్ట్ అయిన అభ్యర్థులు TSSPDCL అధికార పరిధిలో కనీసం మూడు సంవత్సరాల పాటు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా.. పని చేయాలి. 95 శాతం పోస్టులకు.., TSSPDCL అధికార పరిధిలోకి వచ్చే జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ-గద్వాల్, నారాయణపేట, నల్గొండ, భోంగిర్ యాదాద్రి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి మరియు హైదరాబాద్ జిల్లాలు TSSPDC పరిధిలోకి వస్తాయి.

ఎన్పీడీసీఎల్‌ పరిధిలోనూ ఇవే నిబంధనలు ఉంటాయి. అయితే ఈ పరిధిలో ఉండే జిల్లాలో ఎంపికైన అభ్యర్థులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

NOTE:

ఎన్పీడీసీఎల్‌ ఏఈ ఉద్యోగాల ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోండి.

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ లోని ఏఈ ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ పొందవచ్చు.

Whats_app_banner