TS SI Exam: ఎస్‌ఐ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్… ప్రిలిమినరీ ‘కీ’ వచ్చేసింది-ts si preliminary exam key released how to check ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Si Exam: ఎస్‌ఐ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్… ప్రిలిమినరీ ‘కీ’ వచ్చేసింది

TS SI Exam: ఎస్‌ఐ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్… ప్రిలిమినరీ ‘కీ’ వచ్చేసింది

Mahendra Maheshwaram HT Telugu
Aug 13, 2022 09:08 AM IST

ts si preliminary exam key: ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని తెలంగాణ పోలీసు నియామక మండలి విడుదల చేసింది.

తెలంగాణ ఎస్ ఐ పరీక్ష కీ విడుదల
తెలంగాణ ఎస్ ఐ పరీక్ష కీ విడుదల (tsplrb)

ts si preliminary exam key released:పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చింది రిక్రూట్ మెంట్ బోర్డు. గత వారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని విడుదల చేసింది. అధికారిక వైబ్ సైట్ www.tslprb.in లో అందుబాటులో ఉంచింది. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 15 వరకు స్వీకరిస్తామని తెలిపింది.

కీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి.

అభ్యర్థులు మొదటగా www.tslprb.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

PRELIMINARY KEY ENGLISH-TELUGU VERSION అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. లేక ప్రింట్ తీసుకోవచ్చు.

అభ్యంతరాల కోసం ఇదే లింక్...

అభ్యర్థులు మొదటగా www.tslprb.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

PRELIMINARY KEY ENGLISH-TELUGU VERSION కీ అబ్జెక్షన్ పై క్లిక్ చేయాలి.

మీ మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

రాష్ట్రంలో 544 ఎస్‌ఐ పోస్టుల కోసం ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్ విడుదల కాగా.. 2,47,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం హైదరాబాద్‌ సహా పరిసర ప్రాంతాల్లో 503 పరీక్ష కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 7న జరిగిన ప్రాథమిక పరీక్షకు 91.32 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 2,25,759 మంది పరీక్ష రాసినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.

IPL_Entry_Point