TS DOST 2024 Updates : డిగ్రీ ప్రవేశాలు... 'దోస్త్' మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు - కొత్త తేదీలివే-ts dost phase iii registrations last date extended key details check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Dost 2024 Updates : డిగ్రీ ప్రవేశాలు... 'దోస్త్' మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు - కొత్త తేదీలివే

TS DOST 2024 Updates : డిగ్రీ ప్రవేశాలు... 'దోస్త్' మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు - కొత్త తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 03, 2024 10:20 AM IST

TS DOST Phase III Registrations : ‘దోస్త్’ మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించారు. జులై 2వ తేదీతోనే గడువు ముగియగా…జులై 4వ తేదీ వరకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.

దోస్త్ రిజిస్ట్రేషన్లు
దోస్త్ రిజిస్ట్రేషన్లు

TS DOST Phase III Registrations : తెలంగాణ డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. జులై 2వ తేదీతోనే రిజిస్ట్రేషన్ల గడువు ముగియగా తేదీని పొడిగించారు.

మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గడువును జులై 4వ తేదీ సాయంత్రం 5గంటల వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మరో రెండ్రోజులు గడువు పెంచినట్టు పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్లు కూడా జులై 4వ తేదీ వరకు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.

మూడో విడతలో సీట్లు పొందే విద్యార్థులు… జూలై 8 నుంచి 12 మధ్య రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే సీటు కేటాయింపు రద్దు అవుతుంది.

దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 1,066 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ ప్రక్రియ ద్వారా ఈ సీట్లన్నీ భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు దశలు పూర్తి కాగా… మూడో విడత ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. అన్ని విడతలు పూర్తి అయితే… స్పాట్ అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

TS DOST Registration 2024 -రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా….

  • డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించాలి.
  • ఇందులో Candidate Pre-Registrationపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ముందుగా Application Fee Payment ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజును చెల్లించాలి.
  • Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించాలి. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 6వ తేదీ నుంచే ప్రారంభమైంది. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసింది. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి ఇతర అప్డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.

ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులు భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలు భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పోస్టులు వివరాలను టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ సామాజిక మాధ్యమంలో ప్రకటించింది.

  • డ్రైవర్ పోస్టులు-2000
  • శ్రామిక్ -743
  • డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్)-114
  • డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)-84
  • డీఎం/ఏటీఎం/మెకానిక్ ఇంజినీర్-40
  • అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)-23
  • మెడికల్ ఆఫీసర్-14
  • సెక్షన్ ఆఫీసర్(సివిల్)-11
  • అకౌంట్స్ ఆఫీసర్-6
  • మెడికల్ ఆఫీసర్(జనరల్, స్పెషలిస్ట్)-14
  •  

 

Whats_app_banner